గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చికెన్ వండలేదని కన్నతల్లిని పొడిచి చంపిన కొడుకు:గుంటూరులో దారుణం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

గుంటూరు:అసలే మానవతా విలువలే మంటగలిగిపోతున్న నేటి కాలంలో మద్యపాన వంటి వ్యసనాలు పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. ఆస్థుల కోసం అయినవాళ్ల ప్రాణాలు తీస్తున్నవారు కొందరైతే...మద్యం మత్తులో వారి ఉసురు తీస్తున్నవారు మరికొందరు.

గుంటూరు జిల్లాలో జరిగిన ఓ దారుణమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు...తాగి ఇంటికి వచ్చిన కొడుకు తాను ఇంటికి వచ్చేసరికి తల్లి చికెన్ వండి రెడీగా పెట్టలేదనే కోపంతో ఏకంగా కత్తితో నరికి చంపేశాడు. ఆ తరువాత అక్కడ నుంచి పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే...

Son killed Mother in Guntur

గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడేపురంలో కిషోర్ అనే వ్యక్తి ఆర్ఎంపిగా పనిచేస్తున్నాడు. ఆదివారం కావడంతో తల్లి మరియమ్మ(60)ని చికెన్ వండమని చెప్పి బైటకు వెళ్లాడు. ఆ తరువాత తాగి ఇంటికి వచ్చాడు. ఆ తరువాత బోజనానికి ఉపక్రమించిన క్రమంలో తల్లి చికెన్ కూడ వండలేదని తెలిసింది. దీంతో ఆగ్రహోదగ్రుడైన కిషర్ తల్లితో గొడవపడి ఆమెను కత్తితో పొడిచి చంపాడు.

అయితే కేకలు వినపడటం ద్వారా ఈ విషయం బయటికి పొక్కడంతో కిషోర్ వెంటనే అక్కడనుంచి పరారయ్యాడు. చుట్టుప్రక్కలవారు వచ్చిచూసేసరికి కిషోర్ తల్లి రక్తపు మడుగులో పడి ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే తనకు ఆస్తి పంపకాల్లో తల్లి అన్యాయం చేసిందని కిషోర్ తరుచూ తల్లితో గొడవ పడుతుండేవాడని తెలిసింది.

విజయవాడ కానూరులో ఓ నివాసంలో మృతదేహం కలకలం రేపింది. ఆ మృతదేహం తండ్ వీటీపీఎస్‌ రిటైర్డ్‌ ఉద్యోగి కోటేశ్వరరావుగా గుర్తించగా, ఆ శవం పక్కనే అతని కుమారుడు వారం రోజులుగా ఉన్నట్గా, అతడికి మతిస్థిమితం లేనట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి కుమారుడు మానసిక రోగిగా నిర్థారించుకున్నారు.

English summary
Guntur:A son who killed his mother for she was not cooked chicken curry. The incident took place in Guntur district created sensation locally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X