వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరీష్ బ్యాక్ బెంచ్: కేసీఆర్ మరో బాల్‌థాకరే అవుతారా, తప్పదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు... కుటుంబంలో రాజకీయంగా శివసేన అధినేత బాల్ థాకరే ఎదుర్కొన్న అనుభవాలు ఫేస్ చేయాల్సి వస్తుందా? అంటే పరిస్థితులు అలా మారవని చెప్పలేమని అంటున్నారు.

కేసీఆర్, బాల్ థాకరేల మధ్య పలు రాజకీయపరంగా కుటుంబంలో పలు సారుప్యతలు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికార పార్టీ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మరో మహారాష్ట్రలోని మరో శివసేనలా అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు.

బాల్ థాకరేలా కేసీఆర్‌కు వారసత్వం చిక్కేనా?

మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో శివసేనకు, బాల్ థాకరేకు మంచి ఫాలోయింగ్ ఉండింది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణలోను కేసీఆర్ ప్రజల్లో నిలిచిపోయారు. అందుకే ఆయనకు ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. అయితే, బాల్ థాకరేకు తన తదనంతరం వారసత్వం చిక్కుగా పరిణమించింది. తనయుడు ఉద్ధవ్ థాకరే, అల్లుడు రాజ్ థాకరేలు వారసత్వం పోరులో నిలిచారు.

Son or nephew? Is KCR another Bal Thackeray in the making?

ఇప్పటికిప్పుడు కాకపోయినప్పటికీ.. భవిష్యత్తులో కేసీఆర్‌కు అలాంటి పరిస్థితి ఎదురు కావొచ్చని అంటున్నారు. తనయుడు కేటీ రామారావు, అల్లుడు హరీష్ రావుల మధ్య వారసత్వ పోరు రావొచ్చని అంటున్నారు. ఇటీవల తెరాస ప్లీనరీ సందర్భంగా విభేదాలు కనిపించాయని అంటున్నారు. అయితే, ఈ విభేదాలను తెరాస కొట్టి పారేసిందని చెప్పవచ్చు. ఎప్పుడో భవిష్యత్తులో దాని గురించి ఇప్పుడే ఆలోచించలేమని ఎంపీ కవిత చెప్పారు.

పట్టు ఎవరిది?

పార్టీ పైన బాల్ థాకరే తనయుడు ఉద్దవ్, అల్లుడు రాజ్ థాకరేల వలే కేసీఆర్ తనయుడు కేటీఆర్, హరీష్ రావుల పట్టు ఉందని చెప్పవచ్చునంటున్నారు. శివసేనలో ఉన్నప్పుడు బాల్ థాకరే తనయుడు ఉద్దవ్ కంటే అల్లుడు రాజ్ థాకరే పట్టు పార్టీ పైన ఎక్కువగా ఉండేది. తెరాసలోను కేటీఆర్ కంటే హరీష్ రావు ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది ఎవరు కొట్టిపారేయలేనిదని అంటున్నారు.

బ్యాక్ బెంచ్ అంశం సమసిపోయినా..!

గత నెల 27న జరిగిన తెరాస ప్లీనరీలో హరీష్ రావుకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఊహాగానాలు వినిపించాయి. హరీష్ రావు వెనుక వరుసలో కూర్చోవడం చర్చనీయాంశమైంది. ఇది శివసేనను గుర్తుకు తెస్తుందనే వారు లేకపోలేదు. అయితే, తెరాసలో ఎలాంటి విభేదాలు లేవని, అందరూ కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే పని చేస్తున్నారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.

హరీష్ రావు బ్యాక్ బెంచ్ అంశం తొలుత చర్చనీయాంశమైనప్పటికీ ఆ తర్వాత తెరాస వర్గాల వివరణతో దానిపై చర్చకు తెరపడిందని చెప్పవచ్చు. వారసత్వం విషయంలో గతంలో బాల్ థాకరే ఫేస్ చేసిన సమస్య ఎప్పటికైనా కేసీఆర్‌కు తప్పకపోవచ్చునని అంటున్నారు. అయితే, అది ఇప్పుడే చర్చించే అంశం కాదని తెరాస వర్గాలు చెబుతున్నాయి.

English summary
Is Telangana Chief Minister K Chandrasekhar Rao a Bal Thackeray in the making? There are more than one similarity between the CM of India's youngest state and the late Shiv Sena patriarch and the question of succession in the ruling Telangana Rashtra Samiti (TRS) is something that has kept political observers interested. Will Telangana go Maharashtra's way?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X