ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాన్నా నీకు కరోనా నెగిటివ్ అని అరిచిన కొడుకు ..పాజిటివ్ అనుకుని భయంతో తండ్రి మృతి

|
Google Oneindia TeluguNews

తన తండ్రికి కరోనా నెగిటివ్ వచ్చింది అని సంతోషంగా ఒక కొడుకు చేసిన పని ఆ తండ్రి ప్రాణం తీసింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో జరిగిన సంఘటనలో ఎంతో సంతోషంగా తన తండ్రికి మంచి విషయాన్ని చెప్పే ఉద్దేశంతో నాన్న నీకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని బిగ్గరగా అరిచి చెప్పిన కొడుకు చేసిన పని , విషయం అర్ధం కాక కరోనా పాజిటివ్ అని తండ్రి భయంతో కుప్పకూలి మరణించిన విషాదం తీవ్ర వేదనకు గురి చేస్తుంది.

 కరోనా విషయంలో ఢిల్లీ కంటే హైదరాబాద్ సేఫ్ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్ కరోనా విషయంలో ఢిల్లీ కంటే హైదరాబాద్ సేఫ్ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని, బడేటి వారి వీధిలో నివాసముంటున్న ఒక వ్యక్తి తన కుమారులతో కలిసి ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఏపీ ప్రభుత్వం కరోనా పరీక్షల నిమిత్తం ప్రారంభించిన మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ సంజీవిని వద్దకు వెళ్లి తండ్రి,కొడుకులిద్దరూ నమూనాలు ఇచ్చారు.రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి ,వారిలో మొదటి గా తండ్రి రిపోర్ట్ వచ్చింది. తండ్రికి కరోనా నెగిటివ్ అని సిబ్బంది చెప్పగానే సంతోషం పట్టలేక కుమారుడు గట్టిగా అరిచి నాన్న నీకు కరోనా నెగిటివ్ అని చెప్పారు. అయితే కొడుకు గట్టిగా అరచి చెప్పడంతో కరోనా పాజిటివ్ అనుకుని భయపడిన సదరు వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలారు.

son said to his father his Corona report is negative..the father died in fear of feeling positive

సమీపంలో ఉన్న వైద్య సిబ్బంది అతనికి చికిత్స చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో వెంటనే అతడిని అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సదరు వ్యక్తి చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆపై మృతదేహానికి మరోసారి కరోనా టెస్ట్ నిర్వహించగా కరోనా పాజిటివ్ గా రావడం మృతుడి కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగిస్తుంది.

English summary
The work done by a son who was happy that his father got a corona negative took the life of that father. The tragedy of a father who dies in fear that his son screams out loud that he has received a corona negative report of his father with the intention of telling his father the good news .the incident took place in Eluru, West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X