హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సన్ స్ట్రోక్: మంత్రి రావెల నుంచి గతంలో జరిగిన సంఘటనలు ఇవే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తండ్రి పేరు గొప్ప..... కొడుకు పేరు దిబ్బ అనే విధంగా మన రాజకీయ నాయకుల పుత్రరత్నాలు వ్యవహారిస్తున్నారు. పుత్రరత్నాల పనికిమాలిన ప్రవర్తనలతో రాజకీయ నేతల పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్న ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తన పుత్రుడి నిర్వాకంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.

నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ లేడీ టీచర్ చేయి పట్టిన లాగిన కేసులో ఈరోజు చంచల్ గూడ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇలా రాజకీయ నేతలు ప్రజలకు సేవ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుంటే వారి పుత్రరత్నాలు మాత్రం వివాదాలకు కేంద్ర బిందువులవుతున్నారు.

నిజానికి ఒకవ్యక్తి ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే ఎన్నో రాజకీయ ఒడుదుడుకులు ఉంటాయి. తాజాగా మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు ఒక వివాహిత మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించటంతో నిర్భయ కేసు నమోదు చేశారు. ఏదో ఒక సాదా సీదా ఆకతాయి అయితే ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు.

son strokes for politicians in telugu states

సాక్షాత్తు ఓ మంత్రి కుమారుడు కావడంతోనే రావెల సుశీల్‌ను అరెస్ట్ చేయాలంటూ అటు రెండు రాష్ట్రాల్లోని మహిలా సంఘాలు ధర్నాలకు దిగాయి. అంతేకాదు చివరకు మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లు సైతం ఊపందుకున్నాయి. ఇలాంటి సంఘటనలు ఒక్క రావెల కిషోర్‌బాబు పుత్రరత్నమే కాదు గతంలో పలువురు రాజకీయ నేతల పుత్రులు ఇలానే వివాదాల్లో ఇరుక్కున్నారు.

మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్ గతంలో తమ ఇంట్లో పనిచేసే ఒక దళిత బాలికపై అత్యాచార యత్నం చేసాడనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు సైతం పలు వివాదాల్లో ఉన్నారు.

బొండా ఉమ కుమారుడి పుట్టినరోజులు వచ్చినా, ఇతగాడికి సంతోషం కలిగినా బైక్ రైడింగ్‌లు చేస్తాడు. గతంలో ఒక బైక్ రైడింగ్ సంఘటనలో కేసులు నమోదు కావటం ఒకవ్యక్తి మృతి చెందాడనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి.
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు ఫారెన్‌లో ఓ చిన్న వివాదంలో ఇరుక్కున్నాడు.

పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కుమార్తె హైదరాబాద్ రోడ్లపై తప్పతాగి పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడిన సంగతి తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రముఖుల పిల్లలు ఇలా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. వీరివల్ల ఎంతో కష్టపడి సంపాదించుకున్న తల్లిదండ్రుల పరువు పోతుంది.

డబ్బు విలువ తెలియకపోవడంతోనే విచ్చలవిడితనం ఎక్కువై ఇలాంటి వికృత చేష్టలకు రాజకీయ నేతలు, ప్రముఖుల పుత్రరత్నాలు పాల్పడుతున్నారు.

English summary
son strokes for politicians in telugu states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X