గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియాకు జ్ఞాపిక: సభలో ఖాళీ కుర్చీలు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

గుంటూరు: రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే సమయంలో తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. దీర్ఘకాల సమస్య కావడంతో అన్నివిధాలా ఆలోచించి తప్పనిసరి పరిస్థితుల్లో విభజనపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గుంటూరులో శుక్రవారం ఎన్నికల బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పార్లమెంట్‌లో విభజన బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఈప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు.

దేశంలో మరే రాష్ట్ర విభజన సమయంలోనూ ఇన్ని సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు. రాబోయే రోజుల్లో సీమాంధ్రను శక్తిమంతమైన ఆర్థిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవ్వరూ ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని సోనియా భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు తాము బాధ్యత వహిస్తామంటూ, అందుకే గవర్నర్‌కు పదేళ్లపాటు ప్రత్యేకాధికారాలు కల్పించామని సోనియా తెలిపారు.

విద్య, ఉద్యోగావకాశాల్లో ఇప్పుడున్న కోటా విధానం పదేళ్లపాటు కొనసాగుతుందని, అందువల్ల విద్యార్థులు, యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సీమాంధ్రలో పెట్రోలియం వర్సిటీ, ఎయిమ్స్, ఐఐటి, కొత్త రైల్వే జోన్, సెంట్రల్ వర్సిటీలతోపాటు విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. సీమాంధ్రకు బిల్లులో కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి వల్ల కేంద్రం నుంచి 90శాతం నిధులు గ్రాంటుగా అందుతాయని తెలిపారు.

ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేస్తే మతతత్వ శక్తులకు ఊతమిచ్చినట్టేనని, బిజెపి-టిడిపి తోడుదొంగలని సోనియా విరుచుకుపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చివరిక్షణం వరకూ కాంగ్రెస్ ద్వారానే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఆయన పేరుచెప్పుకొని ఓట్లు కోరడమంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడమేనని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది. చేసేదే చెబుతుందంటూ సీమాంధ్ర మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలుచేసి తీరుతామని సోనియా గాంధీ స్పష్టం చేశారు.

సోనియా గాంధీ ప్రసంగం

సోనియా గాంధీ ప్రసంగం

రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే సమయంలో తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు.

వేదికపై చిరంజీవి, రఘువీరా

వేదికపై చిరంజీవి, రఘువీరా

గుంటూరులో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో సోనియా గాంధీ మాట్లాడారు.

సభలో ఖాళీగా ఉన్న కుర్చీలు

సభలో ఖాళీగా ఉన్న కుర్చీలు

దీర్ఘకాల సమస్య కావడంతో అన్నివిధాలా ఆలోచించి తప్పనిసరి పరిస్థితుల్లో విభజనపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సోనియా గాంధీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

సోనియాకు జ్ఞాపిక

సోనియాకు జ్ఞాపిక

పార్లమెంట్‌లో విభజన బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఈప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించామని సోనియా తెలిపారు.

సోనియా అభివాదం

సోనియా అభివాదం

దేశంలో మరే రాష్ట్ర విభజన సమయంలోనూ ఇన్ని సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు. రాబోయే రోజుల్లో సీమాంధ్రను శక్తిమంతమైన ఆర్థిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సోనియా హామీ ఇచ్చారు.

హెలికాప్టర్‌లో...

హెలికాప్టర్‌లో...

హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు తాము బాధ్యత వహిస్తామంటూ, అందుకే గవర్నర్‌కు పదేళ్లపాటు ప్రత్యేకాధికారాలు కల్పించామని సోనియా తెలిపారు.

వేదిక వద్దకు వస్తూ..

వేదిక వద్దకు వస్తూ..

విద్య, ఉద్యోగావకాశాల్లో ఇప్పుడున్న కోటా విధానం పదేళ్లపాటు కొనసాగుతుందని, అందువల్ల విద్యార్థులు, యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోనియా భరోసా ఇచ్చారు.

జెడి శీలం అనువాదం

జెడి శీలం అనువాదం

సోనియా గాంధీ ప్రసంగాన్ని జెడి శీలం తెలుగులోకి అనువాదం చేశారు.

English summary
Congress Party president Sonia Gandhi conducted a public meeting in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X