• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

SPB- Ilaiyaraaja:ముగిసిన ఐదు దశాబ్దాల స్నేహం..! ఒంటరైన రాజా..! ఒకరి కోసం ఒకరంటూ..!

|

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం - ఇళయరాజా.. ఒక సినిమాకు ఈ ద్వయం కలిసిందంటే ఆ సినిమా సంగతేమో కానీ.. మ్యాజికల్‌గా మాత్రం పెద్ద హిట్టే అవుతుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజాల మధ్య అనుబంధం విడదీయరానిది. వారి స్నేహం వర్ణించలేనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న విషయాన్ని ఇళయరాజా జీర్ణించుకోలేకున్నారు. వారి స్నేహం ఈ నాటిది కాదు.. ఐదు దశాబ్దాల నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులు. ఎస్పీబీ తనను ఒంటరి వాడిని చేసిపోయాడని ఇళయరాజ భోరున విలపించారు.

ఆ గొంతు మూగబోయింది: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు..!

 బాలు-ఇళయరాజా స్నేహం

బాలు-ఇళయరాజా స్నేహం

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇళయరాజాల స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వారిద్దరూ కలిశారంటే చిన్నపిల్లలై పోతారు. వారి ఆనందం వారు చేసే అల్లరి చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఒకరు గానగంధర్వుడు అయితే మరొకరు మ్యూజిక్ మ్యాస్ట్రో. ఇళయ రాజ సమకూర్చిన కొన్ని వేల బాణీలకు బాలు అంతే అద్భుతంగా పాటలు పాడారు. బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సమయంలో కూడా ఇళయరాజ ఒక ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. బాలు త్వరగా కోలుకుని తిరిగి రావాలి అని చెప్పారు. కానీ ప్రాణస్నేహితుడి మాటను సైతం పక్కనపెట్టిన బాలు కానరాని లోకాలకు వెళ్లిపోయారు.

 సంగీత ప్రపంచంలో సంచలన ద్వయం

సంగీత ప్రపంచంలో సంచలన ద్వయం

ఇళయరాజ తొలిసారిగా ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించడానికి ముందు బాలుతో కలిసి ఎన్నో లైవ్ సంగీత కార్యక్రమాలు చేశాడు. ఇద్దరూ చాలా కింది స్థాయి నుంచే ఎదిగారు. సంగీత విభావరిలో ఇళయరాజ సోదరులు ఆర్కెస్ట్రా పై ఉంటే బాలు మాత్రం తన గాత్రంతో ప్రాణం పోసేవారు. ఇళయరాజ ప్రతి సంగీత కార్యక్రమంలో బాలు లీడ్ సింగర్‌గా ఉన్నాడు. అప్పట్లో హిందీ సినిమాలు డామినేట్ చేసేవి. అయితే ఆ రోజుల్లో బాలు-రాజా ద్వయం సంగీత ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. ముందుగా ఈ ద్వయం గురించి తమిళనాడుకు తెలిసింది. ఆ తర్వాత దక్షిణ భారతంలో ఒక సంచలనంగా ఎదిగారు. ఆ తర్వాత ఉత్తరాదిని కూడా ఈ ఇద్దరూ తమ సంగీతంతో ఊపేశారు. ఆ తర్వాత ఖండాతరాలకు వీరి ప్రతిభ పాకింది.

ఆ ఒక్క ఘటనతో ఇద్దరూ కొంత కాలం దూరం

ఆ ఒక్క ఘటనతో ఇద్దరూ కొంత కాలం దూరం

సినిమా రికార్డింగులు ఉన్న సమయంలో బాలు-రాజ ద్వయంకు ఎలాగో అలాగ పూట గడిచేది. వీరిద్దరి స్నేహం గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలవు. అప్పుడప్పుడు చిన్నపాటి విబేధాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత సద్దుమణిగాయి. కానీ ఒక ఘటన మాత్రం ఇద్దరి మధ్య కొంతకాలం పాటు దూరం చేసింది. అదే ఇళయరాజ కంపోజ్ చేసిన పాటలను ఇతర వేదికలపై ప్రదర్శిస్తున్న సంగీత కళాకారులు తనకు రాయల్టీ చెల్లించాలంటూ బాలును ఉద్దేశించి పరోక్షంగా అన్నారు ఇళయరాజ. ఈ సమయంలోనే ఇళయరాజకు చెందిన మ్యూజిక్ కంపెనీ బాలసుబ్రహ్మణ్యంకు నోటీసులు పంపడం జరిగింది. విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో బాలు ఇళయరాజ కంపోజ్ చేసిన పాటలను పాడారు.

 బాలు చొరవతో సద్దుమణిగిన వివాదం

బాలు చొరవతో సద్దుమణిగిన వివాదం

ఇక ఇళయరాజ పంపిన లీగల్ నోటీసులతో చాలా బాధపడ్డారు ఎస్పీబీ. ఇక తన సంగీత కార్యక్రమాల్లో ఇళయరాజ కంపోజ్ చేసిన పాటలను పాడకూడదని బాలు నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని నెలల తర్వాత రాజా కంపోజ్ చేసిన పాటలు లేకుండా సంగీత కార్యక్రమం చేయడం కష్టమని భావించిన ఎస్పీబీ.. ఇళయరాజాకు రాయల్టీ చెల్లించాలని కార్యక్రమం ప్రమోటర్లకు సూచించారు. ఇక పరిస్థితి సద్దుమణగడంతో ఎస్పీబీ ఇళయరాజ అభిమానులు సంతోషపడ్డారు. ఇక 1970లో ఇళయరాజ కంపోజ్ చేసిన పాటలను తిరిగి రికార్డ్ చేయాలని భావించినప్పుడు బాలుకు జాగ్రత్తలు చెప్పారు. కానీ బాలు వినలేదు. మరుసటి రోజునే తనకు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో ఇళయరాజ మరో గాయకుడు మలేషియా వాసుదేవన్‌తో రికార్డింగ్‌ను పూర్తి చేశారు.

 రాజా గురించి బాలు ఏమన్నారంటే

రాజా గురించి బాలు ఏమన్నారంటే

ఇళయరాజ చేసిన సినిమాల్లో బాలు పాట లేదంటే వెంటనే బాలసుబ్రహ్మణ్యం తాను కూడా గాయకుడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సరదాగా ఇళయరాజ మీదకు ఎక్కేసేవారు. రికార్డింగులకు ఎందుకు పిలవడం లేదు అని రాజాను సరదాగా ఏడిపించేవారు. అంతలా వీరిమధ్య ఆ స్నేహం ఉండేది. దీనికి రాజా నెమ్మదిగా నవ్వి రేపు వచ్చేసేయ్ రికార్డింగ్ మొదలు పెడుదామనే వాడు. ఇలా ఒక్క పాటతో మొదలైన వీరి ప్రయాణం వివిధ భాషల్లో 2వేల పాటల వరకు సాగింది. వీరి ద్వయం సంగీత ప్రంపంచంలో పెను సంచలనంగా మారడమే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి ముద్ర వేసుకుంది. "ఇళయరాజా 1000" లైవ్ కాన్సర్ట్ సమయంలో బాలు కొన్ని గొప్పమాటలు చెప్పారు. రాజా గురించి తాను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని అతని ప్రతిభ ఏమిటో ప్రపంచానికి తెలుసని అన్నారు. తన కష్టం, పనిపట్ల అంకితభావమే ఇళయరాజాను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పారు. ఇళయరాజా తనకోసమే జన్మించాడని, రాజా కోసమే తాను పుట్టినట్లు చెప్పి వారి మధ్య ఉన్న స్నేహ బంధం ఎంతగొప్పదో చెప్పారు.

తొలినాళ్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలు - రాజా

తొలినాళ్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలు - రాజా

అప్పటి వరకు సౌందరరాజన్, పి.సుశీల ద్వయంతో పనిచేసిన ఇళయరాజా... అప్పుడప్పుడే స్టార్స్‌గా ఎదుగుతున్న కమలహాసన్ రజినీకాంత్‌లకు సూటయ్యే వారితో పాటలు పాడించాలని భావించి ఎస్పీబీ జానకి వైపు మరలారు. ఇక అప్పుడు భారతీయ సినిమా సంగీత రంగంలో కొత్త పుంతలు తొక్కింది. ఎస్పీబీ జానకమ్మలతో ఇళయరాజ కంపోజ్ చేసిన పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఎఇలా రెండు దశాబ్దాల పాటు ఎస్పీబీ తప్ప మరొకరు ఇళయరాజాకు కనిపించలేదు. తొలినాళ్లలో ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇద్దరూ కలిస సాయంత్రం వేల ఇతర స్నేహితులతో సమయం గడిపేవారు. ఇక ఆ తర్వాత ఇళయరాజ ఆత్మీయంగా బలపడ్డారు. ఇక అక్కడి నుంచి ఇద్దరూ కలవడం తక్కువైపోయింది. ఇళయరాజ సోదరుడు గంగై అమరేన్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు బాలు వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించగలిగాడు.

మొత్తానికి ఎస్పీబీ-ఇళయరాజా కాంబో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలు తమిళనాడులో స్థిరపడినా.. తెలుగంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పేవారు.

English summary
SP Balasubrahmanyam who passed away left a void in Indian film industry. His all time friend Illayaraja recalls his friendship with Balu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X