చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనకు తెలియని ఎస్పీ బాలు రికార్డు: 12 గంటల్లో ఏకధాటిగా 21 పాటలు: ఎవరి కోసం?..ఏ భాషలో?

|
Google Oneindia TeluguNews

అమరావతి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన కేరీర్‌లో ఎన్నో గొప్ప మైలురాళ్లను అందుకున్నారు. చెరిగిపోని చరిత్రను సృష్టించారు. ఎవరూ అందుకోవడానికి కనీసం ఊహించనూ లేని ఎత్తుకు ఎదిగారు. దశాబ్దాల కాలం పాటు తన గానమాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. శిశుర్వేతి.. పశుర్వేతి.. అనే సూక్తిని నిలువుటద్దంలా నిలిచారయాన. సినీ నేపథ్య గాయకుడిగా ఆయన పాడినన్ని పాటలు.. చెరిపేస్తే చెరిగిపోయేవి కాదు. దేశంలో 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఆయన కొన్ని అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.

ఎస్పీ బాలు..ద లాస్ట్ లెజెండ్: కారణజన్ముడు: ఆ సమున్నత శిఖరాన్ని అందుకోవడం.. ఎవరితరం?ఎస్పీ బాలు..ద లాస్ట్ లెజెండ్: కారణజన్ముడు: ఆ సమున్నత శిఖరాన్ని అందుకోవడం.. ఎవరితరం?

12 గంటల్లో ఏకధాటిగా.. 21 పాటలను రికార్డు చేశారు. అలా చేయడం ఎవరి మాత్రం సాధ్యమౌతుంది? అన్నీ వేర్వేరు పాటలు. వేర్వేరు స్వరాల్లో సాగే పాటలు. ఒకదానికొకటి పొంతన లేనివి. ఈ పాటలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నడ సినిమాల కోసం పాడారు. ఒకే మ్యూజిక్ డైరెక్టర్ దర్శకత్వంలో ఆయన 12 గంటల్లో 21 పాటలను ఆలపించారు. ఆ సంగీత దర్శకుడు ఉపేంద్రకుమార్. తెలుగువాడే. బెంగళూరులో స్థిరపడ్డారు. ఒడిశాలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారాయన. అనంతరం కన్నడ చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

SP Balasubrahmanyam recording 21 songs in 12 hours for Kannada music composer Upendra Kumar.

1981లో ఉపేంద్రకుమార్ మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రచండ పుఠాణిగళు, మహా ప్రచండరు, శ్రీమాన్ సినిమాలకు ఉపేంద్రకుమార్ సంగీత దర్శకత్వాన్ని వహించారు. ఈ మూడు సినిమాలకు అవసరమైన పాటలతో పాటు మరి కొన్నింటిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 12 గంటల్లో 21 పాటలను పాడారు. ఉద‌యం 9 గంటల నుంచి రాత్రి 9 వ‌ర‌కూ 21 క‌న్న‌డ‌ పాట‌లు పాడి బాలు రికార్డు నెల‌కొల్పారు. అదో రికార్డు. ఆ తరువాత మరెవరూ ఈ ఫీట్‌ను సాధించలేకపోయారు. 12 గంటల వ్యవధిలో 21 పాటలను పాడిన తొలి, చివరి సినీ నేపథ్య గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు శాండల్‌వుడ్‌లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

English summary
Veteran Singer SP Balasubrahmanyam had surprised the singing fraternity after recording 21 songs in 12 hours for Kannada music composer Upendra Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X