• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎస్పీ బాలు మొదటి గురువు ఆయన తండ్రే: కోనేటమ్మపేట నుంచి మద్రాసుకు పయనమిలా..

|

హైదరాబాద్/అమరావతి: సుమారు ఐదు దశాబ్దాలపాటు దక్షిణాది సంగీత ప్రపంచాన్ని ఏలిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయనకు చిన్ననాటి నుంచే సంగీతం అంటే వల్లమాలిన ప్రేమ. ఆ అమితాసక్తే ఆయనను సంగీత ప్రపంచంలో ఓ ధృవతారలా నిలబెట్టింది. తొలి పాట కోసం కష్టపడినా.. ఆ తర్వాత ఆయన మళ్లీ వెనుదిరిగి చూడలేదు.

వేల పాటలు పాడి.. కోట్లాది అభిమానుల మనసు దోచిన ఎస్పీ బాలు తొలి పాట ఇదే

బాలుకు తండ్రే మొదటి గురువు..

బాలుకు తండ్రే మొదటి గురువు..

ఎస్పీ బాలు బాల్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గడిచింది. 1946, జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు బాలు జన్మించారు. కాగా, తండ్రి సాంబమూర్తి హరకథా కళాకారుడు. ఆయన భక్తిరస నాటకాలు కూడా ప్రదర్శించేవారు. తండ్రి కారణంగా బాలుకు కూడా సంగీతంపై మక్కువ కలిగింది. దీంతో బాలుకు తన తండ్రి సాంబమూర్తే తొలి గురువయ్యారు. ఇలా ఐదేళ్ల వయస్సులోనే తండ్రితో కలిసి ‘భక్త రామదాసు' నాటకంలో నటించారు.

నమ్మలేకున్నాం..: ఎస్పీ బాలు మృతిపై పవన్ కళ్యాణ్, నాగబాబు స్పందన

చదువుతోపాటు ఆటల్లోనూ ముందుండే బాలు..

చదువుతోపాటు ఆటల్లోనూ ముందుండే బాలు..

నగరిలోని మేనమా శ్రీనివాసరావు ఇంట్లో ఉంటూ ప్రాథమిక విద్యను పూర్తి చేశారు బాలు. ఇక ఆ తర్వాత ప్రాథమికోన్నత విద్యను శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో పూర్తి పూర్తి చేశారు. కాగా, చదువులోనూ, ఆటల్లోనూ బాలు ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉండేవారు. బాలు గొంతు బాగుండటంతో పాటలు పాడించేవారు ఉపాధ్యాయులు. ఇలా జీవీ సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయులు బాలుతో చెంచులక్ష్మి సినిమాలో సుశీల ఆలపించిన ‘పాలకడలిపై శేషతల్పమున' అనే పాటను పాడించి టేప్ రికార్డర్‌లో రికార్డు చేశారు. ఆ తర్వాత పలు నాటకాల్లోనూ వేశాలు వేశారు బాలు.

మద్రాసుకు పయనం.. మొదటి అవకాశం నటనలోనే..

మద్రాసుకు పయనం.. మొదటి అవకాశం నటనలోనే..

తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ చదివారు. ఈ సమయంలో మద్రాసు ఆలియాండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటకంలో స్త్రీ పాత్ర ధరించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత విజయవాడ ఆకాశవాణిలో బాలు స్వయంగా రాసి, బాణీకట్టి పాడిన ఒక లలిత గీతానికి బహుబమతి కూడా గెలుచుకున్నారు. అనంతరం మద్రాసులో ఏఎంఐఈలో చేరి చదువును కొనసాగిస్తూనే.. సినిమాల్లో పాటలు పాడే అవకాశం కోసం ప్రయత్నించారు. మొదటి ఆయనకు వెండితెరలో నటించేందుకు అవకాశం వచ్చింది. అలా ఆయన నటుడిగానూ మారారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు కోదండపాణి తొలి అవకాశం ఇవ్వడంతో పూర్తిస్థాయి గాయకుడిగా మారిపోయారు బాల సుబ్రహ్మణ్యం. అలాగే. సినిమాల్లోనూ నటించడం కొనసాగించారు.

English summary
SP Balasubrahmanyam's first teacher is his father.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X