చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్పీ బాలు..ద లాస్ట్ లెజెండ్: కారణజన్ముడు: ఆ సమున్నత శిఖరాన్ని అందుకోవడం.. ఎవరితరం?

|
Google Oneindia TeluguNews

అమరావతి: కొందరు మహానుభావులు కారణం లేకుండా జన్మించరు అని అంటుంటారు పెద్దలు. అలాంటి వారిని కారణజన్ములుగా పిలస్తుంటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. కారణజన్ముడే. సంగీత ప్రపంచాన్ని ఉద్ధరించడానికే ఆయన జన్మించారు. కొన్ని తరాల వారిని సంగీతం ప్రపంచానికి పరిచయం చేయడానికే ఆయన జన్మనెత్తారు. ఆయనే లేకపోయి ఉంటే.. పాటల తోటలు ఎంతలా వాడిపోయి ఉండేవో ఊహకు కూడా అందదు. సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకునే ప్రతి ఒక్క వర్ధమాన గాయకుడు.. బాలసుబ్రహ్మణ్యాన్ని ఓ బెంచ్ మార్క్‌గా భావిస్తారు. ఆయన స్థాయికి చేరుకోవాలనే కలలు గంటారు.

వేల పాటలు పాడి.. కోట్లాది అభిమానుల మనసు దోచిన ఎస్పీ బాలు తొలి పాట ఇదేవేల పాటలు పాడి.. కోట్లాది అభిమానుల మనసు దోచిన ఎస్పీ బాలు తొలి పాట ఇదే

ప్రతి తరాన్నీ ఉర్రూతలూగించి..

ప్రతి తరాన్నీ ఉర్రూతలూగించి..

ఆ సమయంలో వారికి మనో ఫలకం మీద మరో గాయకుడి పేరు బహుశా స్ఫూర్తికి రాకపోవచ్చు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలను వినని తరం అనేదే లేకపోవచ్చు. ప్రతి తరంలోనూ ఆయన తన గళ మాధుర్యాన్ని వినిపిస్తూ వచ్చారు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన పాటలను వింటూ పెరిగిన వారి సంఖ్య.. ఆకాశంలో నక్షత్రాల్లాంటివే. ఒక్క తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదాయన. 16 భారతీయ భాషల్లో పాటలను పాడటం అంటే మాటలు కాదు. వేర్వేరు భాషల్లో ఆయన పాడిన పాటలన్నీ అక్కడి శ్రోతలను కట్టిపడేసేవే. మళ్లీ మళ్లీ వినాలనిపించేవే. ఎస్పీ బాలు పాటలను వింటూ పెరగని వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. అభిమానించని వారు ఉండరేమో. అలా కొన్ని తరాలను ఆయన తన గానమాధుర్యంతో కట్టిపడేశారు.

ఆ మాయాజాలం ఒక్క ఎస్పీబీకే సాధ్యం..

ఆ మాయాజాలం ఒక్క ఎస్పీబీకే సాధ్యం..

కొన్ని తరాల వారిని సంగీత ప్రపంచ వైపు ఆకర్షితులను చేయగలిగిన శక్తి సామర్థ్యాలు, మాయాజాలం.. ఒక్క బాలసుబ్రహ్మణ్యం గొంతుకు మాత్రమే సాధ్యం. ఆయనలా పాటలు పాడాలని, ఆయనలా సంగీత ప్రపంచానికి సేవలు అందించాలని, ఆయనలా చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో వందలాది మంది యువతీ యువకులు సంగీతాన్ని నేర్చుకోవడానికి ముందుకొచ్చారు. తెలుగులో ఓ ప్రైవేటు ఛానల్‌లో నిర్వహించిన సంగీత పోటీలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వందలాది మంది వర్ధమాన గాయకులు ఎస్పీ బాలు ఓ బ్రాండ్‌నేమ్. చిన్న పిల్లల దగ్గరి నుంచి యువత వరకూ ప్రతి ఒక్కరినీ సంగీతం వైపు ఆకర్షితులను చేయగలిగిన సమ్మోహన గాత్రం ఆయనకు మాత్రమే సాధ్యం.

16 భాషల్లో 40 వేల పాటలు.. మరొకరికి సాధ్యమా?

16 భాషల్లో 40 వేల పాటలు.. మరొకరికి సాధ్యమా?

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఒడిశా, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి..ఇలా దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ ఆయన అభిమానులు ఉన్నారు. 40 వేలకు పైగా పాటలు పాడారు. ఎస్పీ బాలు పాడినన్ని భాషలు.. ఇప్పట్లో మరో గాయకుడు అందుకోలేడు. ఆయన పాడినన్ని 40 వేలకు పైగా పాటలను ఇక ముందు కూడా ఎవరూ అందుకోలేరు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరనే వార్తను తెలుసుకున్న తరువాత.. స్పందించని చిత్ర పరిశ్రమ అనేది భారత్‌లో లేదు. అన్ని భాషల సినీ ప్రముఖులు.. తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. శోక సముద్రంలో మునిగిపోయారు.

ఒక్క గొంతు.. వేల పాటలు.. భిన్న స్వరాలు..

ఒక్క గొంతు.. వేల పాటలు.. భిన్న స్వరాలు..

ఆయా భాషల చిత్రపరిశ్రమకు మన బాలసుబ్రహ్మణ్యం చేసిన సేవలు ఏమిటో.. ఎలాంటివో చెప్పుకోవడానికి ఈ ఉదాహరణలు చాలు. దక్షిణాది రాష్ట్రాల చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖలు ఎవరూ అంటే.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు ముందువరసలో ఉంటుంది. ఒక్క గళం.. ఒకే ఒక్క గొంతు.. లెక్కేలేనన్ని భిన్న స్వరాలు వినిపించింది. ప్రతి పాటా భిన్నమే..అయినా గళం మాత్రం ఒక్కటే. ఆ మేజిక్ ఒక్క బాలుకే సాధ్యమైంది. సంగీత ప్రపంచంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధించని మైలురాళ్లు, చేరుకోలేని గమ్యం ఉండదు. అన్ని భాషలకు చెందిన సంగీత దర్శకులతో ఆయన పని చేశారు.

బాలుకు ముందు.. బాలుకు తరువాత..

బాలుకు ముందు.. బాలుకు తరువాత..

క్రీస్తు పూర్వం.. క్రీసు శకం.. అంటూ ఎలా చరిత్రను విభజించారో.. సంగీత ప్రపంచాన్ని కూడా ఎస్పీ బాలుకు ముందు.. ఎస్పీ బాలుకు తరువాత.. అంటూ చెప్పుకోవాల్సి న పరిస్థితులు ఉన్నాయి. నిజమే- జానపదాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని మేళవించిన గళం ఆయనది. సంగీత ప్రపంచంలో ఆయన స్పృశించని కోణం అంటూ ఏదీ లేదు. అన్ని స్వరాలూ ఆయన గళం నుంచి జాలువారాయి. ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచెత్తాయి. గాన మాధుర్యంలో ఓలలాడించాయి. ఎలాంటి పాటలనైనా అలవోకగా పాడేయడం ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యానికి దేవుడిచ్చిన వరం.

English summary
SP Balasubrahmanyam the last legend: Never before Ever after, Here is why?. Legendary playback singer SP Balasubrahmanyam passed away on September 25 at the age of 74. The singer had been at MGM Healthcare in Chennai since August 5 after he tested positive for coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X