వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం: విశాఖ ఉత్సవ్‌లో చంద్రబాబు, ఒకే కాలేజీలో చదివామన్న ఎస్పీ బాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: మేటి నగరంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. విశాఖపట్నంలో జరుగుతున్న విశాఖ ఉత్సవ్ రెండో రోజు కార్యక్రమానికి శనివారం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. విశాఖకు బ్రహ్మాండమైన భవిష్యత్ ఉందని అన్నారు.

విశాఖ ప్రజలు చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో హుధుద్ తుపానును జయించారని అన్నారు. హుదూద్ ఆనవాళ్లు కూడా కనబడకుండా, ఇక్కడి ప్రజలు పచ్చదనాన్ని పెంపొందించారని చంద్రబాబు అభినందించారు.

విశాఖకు సమీపంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. అనకాపల్లి-భగాపురం మధ్య సుందర నగరాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు.

చదివింది ఒకే కళాశాల: బాలు

‘స్వర కళా సామ్రాట్‌' బిరుదును ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా అందుకోవడం మరువలేని అనుభూతి అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సంవత్సరాలు వేరైనా తామిద్దరం ఒకే కళాశాలలో చదువుకున్నామని.. ఒకే జిల్లాలో (చిత్తూరు) పుట్టామని గుర్తుచేసుకున్నారు. తమ అనుబంధం ఏళ్లనాటిదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించి పాలకులకు సహకరించాలని కోరారు.

బాలు-శైలజ పాట

బాలు-శైలజ పాట

మేటి నగరంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. విశాఖపట్నంలో జరుగుతున్న విశాఖ ఉత్సవ్ రెండో రోజు కార్యక్రమానికి శనివారం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. విశాఖకు బ్రహ్మాండమైన భవిష్యత్ ఉందని అన్నారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

విశాఖ ప్రజలు చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో హుదూద్ తుపానును జయించారని అన్నారు. హుదూద్ ఆనవాళ్లు కూడా కనబడకుండా, ఇక్కడి ప్రజలు పచ్చదనాన్ని పెంపొందించారని చంద్రబాబు అభినందించారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

విశాఖకు సమీపంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

అనకాపల్లి-భగాపురం మధ్య సుందర నగరాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి విశాఖ నగరానికి ఉన్న అనుకూలతలు దేశంలో మరే ఇతర నగరానికి లేవని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

తూర్పుతీరానికి ఆభరణం వంటి విశాఖను అంతర్జాతీయ పర్యాటక నగరంగా, హిల్‌సిటీగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

శనివారం విశాఖ ఉత్సవ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. అందులోభాగంగా సాగర తీరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. అరుదైన భౌగోళిక అనుకూలతలతో ఉన్న విశాఖ దేశంలోనే ఒక మేటైన, అతిముఖ్యమైన నగరంగా మారుతుందని తెలిపారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

ఈ నగరానికి అంతర్జాతీయ పర్యాటకులు వచ్చే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

విశాఖలో ప్రతి 2 నెలలకు ఒక కార్యక్రమం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

సాగరతీరంలో ప్రతి శని, ఆదివారాల్లో దేశంలోని ప్రముఖ కళాకారులతో వినోద కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ‘పరిమళ' పేరుతో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన, లేజర్‌షో, తీరంలో కార్నివాల్‌, మధురవాడ జాతరలో జానపద కళారూపాల ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘స్వర కళా సామ్రాట్‌' బిరుదును ప్రదానం చేయడం తన పూర్వజన్మ సుకృతమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా బాలుకు ఈ బిరుదును ప్రదానం చేసి, అన్నమయ్య విగ్రహం, ప్రశంసాపత్రం బహూకరించారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

దుశ్శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యంకు ఎవరూ పోటీలేరని, ఆయనకు ఆయనే పోటీ అని ప్రశంసించారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

50 ఏళ్లుగా ఒక రంగంలో అగ్రస్థానంలో నిలవడం సామాన్య విషయం కాదన్నారు. నిరంతరకృషి, కఠోర సాధనతోనే ఎంచుకున్న రంగంలో అగ్రస్థానంలో కొనసాగగలమని పేర్కొన్నారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

రాబోయే 30, 40ఏళ్ల వరకు ఆయన స్వరాన్ని వింటామన్నారు. తన పాటలతో తెలుగుజాతికీర్తిని అంతర్జాతీయంగా రెపరెపలాడించిన ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే అత్యున్నత వ్యక్తిత్వం కలవాడని, ఆదర్శప్రాయుడని కీర్తించారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

‘స్వర కళా సామ్రాట్‌' బిరుదును ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా అందుకోవడం మరువలేని అనుభూతి అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

సంవత్సరాలు వేరైనా తామిద్దరం ఒకే కళాశాలలో చదువుకున్నామని.. ఒకే జిల్లాలో (చిత్తూరు) పుట్టామని గుర్తుచేసుకున్నారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

తమ అనుబంధం ఏళ్లనాటిదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించి పాలకులకు సహకరించాలని కోరారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ‘పరిమళ' పేరుతో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన, లేజర్‌షో, తీరంలో కార్నివాల్‌, మధురవాడ జాతరలో జానపద కళారూపాల ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు.

English summary
Chief Minister N. Chandrababu Naidu felicitated playback singer S.P. Balasubrahmanyam at the ongoing Visakha Utsav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X