వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో వంశీ సీటు కేటాయింపులో ట్విస్టు : స్పీకర్ ప్రకటించారు..కానీ: వైసీపీ తరపున..!

|
Google Oneindia TeluguNews

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీటు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ శాసనసభలో వంశీ తనను టీడీపీ నుండి సస్పెండ్ చేసినట్లుగా తెలిసిందని..తానూ టీడీపీలో ఉండలేనని తనను స్వతంత్ర అభ్యర్ధిగా గుర్తించి..సీటు మార్చాలని సభలోనే కోరారు. దీని పైన టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, స్పీకర్ మాత్రం వంశీ కోరిన విధంగా ఆయనను ప్రత్యేకంగా గుర్తించి..అసెంబ్లీ నిబంధనల కు అనుగుణంగా సీటు కేటాయించాలని అసెంబ్లీ కార్యదర్శిని సభలోనే ఆదేశించారు.

అయితే, ఇప్పుడు అదే వ్యవహారంలో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో..ఇంకా అధికారికంగా వైసీపీలో చేరకపోయినా.. వంశీ మాత్రం.. తాజాగా సభలో వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

స్పీకర్ ప్రకటించినా...అక్కడే
టీడీపీ నుంచి బయటకు వచ్చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ అసెంబ్లీలో ఇంకా ఆ పార్టీ ఎమ్మెల్యేల పక్క నే కూర్చోవాల్సి వస్తోంది. టీడీపీ నుంచి సస్పెండైన దృష్ట్యా ఆయనను ఏ పార్టీకి చెం దని ఎమ్మెల్యేగా పరిగణిస్తున్నామని, ప్రత్యేక సీటు ఇస్తామని సభలో స్పీకర్‌ ప్రకటించారు. కానీ ఈ నిర్ణయం వచ్చే సమావేశాల నుంచి అమలవుతుందని అసెంబ్లీ వర్గా లు తెలిపాయి. దీంతో వంశీ ప్రస్తుతానికి టీడీపీ ఎమ్మెల్యేల పక్కనే కూర్చోవాల్సి వ స్తోంది.

టీడీఎల్పీ విప్‌ బాల వీరాంజనేయస్వామి సీటు పక్కన ఆయన సీటు ఉంది. తనకు కేటాయించిన సీటులో కూర్చుంటునప్పటికీ ఆ తరువాత వెనుక వైపు ఎక్కడ ఖాళీ ఉంటే వంశీ అక్కడ కూర్చుంటున్నారు. ఈ శాసనసభా సమావేశాలు మరో రెండు రోజులు జరగనున్నాయి. అవి పూర్తయ్యే వరకూ టీడీపీ బెంచ్ ల్లోనే వంశీ కూర్చోవాలని..వచ్చే సమావేశాల నుండి ప్రత్యేకంగా సీటు కేటాయింపు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Speaker orders on seat allotment for Vamsi will be from next sessions

వైసీపీలో చేరకపోయినా...
టీడీపీ నుండి గెలిచినా..వైసీపీలో అధికారికంగా చేరకపోయినా..సభలో టీడీపీ మీద వైసీపీ సభ్యులు విమర్శలు సమయంలో వారికి వంశీ మద్దతుగా నిలుస్తున్నారు. ప్రత్యేకంగా టీడీపీ అధినేత..ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన వైసీపీ సభ్యులు విమర్శలు సంధిస్తున్న సమయంలో..వంశీ వారికి సాయం అందిస్తున్నారు. తాజాగా.. భలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. టీడీపీ ఎమ్మెల్యేల వరసలోనే కూర్చున్న వంశీ అక్కడ నుంచే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సభలో మాట్లాడాల్సిన పాయింట్లపై చీ టీలు రాసి పంపిస్తూ కనిపించారు.

దీంతో..చంద్రబాబు సభలో ఎదురుగా సీఎం జగన్..పక్కనే సీనియర్ నేతలు ఆనం.. అంబటి..ఒక వైపు మంత్రి కొడాలి సీట్లు వ్యూహాత్యకంగానే ఖరారు చేసారు. ఇక, తమ బెంచ్ ల్లోనే ఉంటూ..తమకు వ్యతిరేకంగా అధికార పక్షానికి వంశీ సాయం అందిస్తున్నా..ఆయన మీద టీడీపీ ఇప్పటికిప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేని స్థితిలో ఉంది. దీంతో..అధికార పక్షం పూర్తగా తమకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసకుంటోంది.

English summary
Speaker suggested assembly secretary to treat Vallabhaneni Vamsi as independent member and allot him special seat apart from tdp. But, Officials saying this decision will be implemented from next sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X