వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పాపంలో నేనూ భాగస్వామినే: అందుకే 15 ఏళ్లు అధికారానికి దూరమయ్యా: సభలో స్పీకర్ సెన్సేషన్..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో అప్పుడు చేసిన పాపంలో తాను భాగస్వామినేనని అంగీకరించారు. ఆ పాపం ఫలితమే తాను 15 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో స్పీకర్ గా తనకున్న అధికారాలు ఏంటో తనకు తెలుసని.. అసెంబ్లీ ఎవరి జాగీరు కాదని సీరియస్ అయ్యారు. టీడీపీ సభను వైసీపీ శాసన సభాపక్ష కార్యాలయం అంటూ చేసిన వ్యాఖ్యలు సరికాదని..వాటిని ఉప సంహరించుకోవాలని సూచించారు. గతంలో సభ జరిగిన తీరు మీద తమ్మినేని ప్రస్తావించారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ టీడీపీ మీద స్పీకర్ తమ్మినేని సీరియస్ అయ్యారు. ఆ తరువాత వంశీకి నిబంధనల ప్రకారం సంతంత్ర సభ్యుడిగా గుర్తిస్తూ..సీటు కేటాయించాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించారు.

అక్కడే కొడతా..: మరోసారి ఇలా జరిగితే: అధికారికి స్పీకర్ తమ్మినేని హెచ్చరిక..!అక్కడే కొడతా..: మరోసారి ఇలా జరిగితే: అధికారికి స్పీకర్ తమ్మినేని హెచ్చరిక..!

ఆ పాపంలో నేను భాగస్వామిని..
సభలో వల్లభనేని వంశీకి మాట్లాడే అవకాశం ఇవ్వటం పైన టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయటం పైన వైసీపీ సైతం నిరసన వ్యక్తం చేసింది. ఆ సమయంలో వంశీకే కాదు..గతంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు సైతం సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ అధికార పక్ష సభ్యులు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. అవును..సభలో ఎన్టీఆర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.. ఆ సమయంలో తాను టీడీపీలోనే ఉన్నానని..ఆ పాపంలో తాను భాగస్వామినేనని చెప్పుకొచ్చారు. దాని ఫలితమే తాను 15 ఏళ్లు అధికారానికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేసారు. ఏకంగా స్పీకర్ సభలోనే ీ వ్యాఖ్యలు చేయటం ద్వారా ఇది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Speaker Tammineni regret on NTR episode when he was in TDP

సభ మీ జాగీరు కాదు..
వంశీకి మాట్లాడేందుకు అనుమతి ఇచ్చిన సందర్బంలో టీడీపీ నేతలు ఇది శాసనసభలా కాకుండా.. వైసీపీ పార్టీ ఆఫీసులా మారిందని వ్యాఖ్యానించారు. దీని మీద స్పీకర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది టీడీపీ ఆఫీసు కాదన్నారు. ఆ వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని సూచించారు. అదే సమయంలో గతంలో జరిగిన ప్రొసీడింగ్స్ మీద స్పీకర్ వ్యాఖ్యలు చేసారు. గతంలో సభను ఎలా నడిపారో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. తనకు ఉన్న అధికారాలు తనకు తెలుసని..తన విధులు తనకు బాగా తెలుసంటూ చెప్పుకొచ్చారు. సభలో వంశీ సభ్యుడుగా ఉండగా..మాట్లాడే అవకాశం ఇవ్వటంలో తప్పు లేదని వివరించారు. అసెంబ్లీ అంటే ప్రజాలయం అని..అది ఎవరి జాగీరు కాదని స్పీకర్ స్పష్టం చేసారు.

English summary
AP Speaker regret on NTR spisode which taken place in when he was in TDP. speaker says with that issue effect only he away from political power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X