హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రోపొలిస్: విదేశీ ప్రతినిధులతో కెటిఆర్ చర్చ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు పదకొండవ మెట్రోపాలిస్ వరల్డ్ కాంగ్రెస్ అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు విదేశీ ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు, అవగాహన ఒప్పందాలు, డాక్యుమెంట్ల రూపకల్పనలో వివిధ దేశాల మేయర్లు, నిపుణులు నిమగ్నమయ్యారు.

సదస్సు రెండో రోజైన బుధవారం పది సమావేశాలు జరిగాయి. ఇందులో భాగంగా ‘అర్బన్ ఎజెండాలో భాగంగా సమాచారం, భారీ సవాళ్లు, ఉపాయాలు' అన్న అంశంపై హాల్ 3లో నిర్వహించిన ప్లీనరీకి మంత్రి కె. తారకరామారావు వక్తగా విచ్చేసి ప్రసంగించారు. అంతకు ముందు మెట్రోపాలిస్ అధ్యక్షుడు జీన్ పాల్ హచన్ అజెండా అంశంపై మాట్లాడారు.

ఈ ప్లీనరీ అనంతరం మంత్రి కె తారాకరామరావు, కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు సాయంత్రం వరుసగా పారిస్, బెర్లిన్, జోహన్స్‌బర్గ్, ఇరాన్‌లోని మసద్,బ్రెజిల్‌లోని సావ్‌పోలా, బార్సిలోనా, తెహరన్ నగరాలకు చెందిన మేయర్లు, ప్రతినిధుల బృందంతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇందులో భాగంగా సావ్‌పోలా నగర బృందం హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు, ప్రతిపాదనల రూపకల్పనలో సహాయం అందించేందుకు మొగ్గుచూపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి డేటాబేస్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పారదర్శకతను పెంపొందిస్తూ మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తమది కొత్త కొత్త యువ రాష్ట్రమైనందున, ఇక్కడి ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా, విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సిఎం కెసిఆర్ సంకల్పించినట్లు తెలిపారు. ఈ దిశగా ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకునేందుకు సమగ్ర సర్వే నిర్వహించినట్లు తెలిపారు.

కాగా, బార్సిలోనా మేయర్ గ్జావియర్ ట్రియస్, జెనీవా మేయర్ రెమీ పగానీ, జహన్స్‌బర్గ్ మేయర్ పార్క్స్ తౌ, విక్టోరియా మేయర్ జక్వైలిన్ వౌస్టాకె బెల్లె, ప్రపంచ బ్యాంకు సీనియర్ కన్సల్టెంట్ వికాస్ కనున్గో, బల్దియా కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు ప్రసంగించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పౌరసేవల నిర్వహణ, పట్టణాభివృద్ధి కోసం చేస్తున్న కృషితో పాటు అభివృద్ధి మరింత వేగవంతంగా సాధించేందుకు అధిగమించాల్సిన పరిస్థితులను కమిషనర్ వివరించారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు పదకొండవ మెట్రోపాలిస్ వరల్డ్ కాంగ్రెస్ అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు విదేశీ ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు, అవగాహన ఒప్పందాలు, డాక్యుమెంట్ల రూపకల్పనలో వివిధ దేశాల మేయర్లు, నిపుణులు నిమగ్నమయ్యారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

సదస్సు రెండో రోజైన బుధవారం పది సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో మంత్రి తారకరామారావు హాజరయ్యారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

‘అర్బన్ ఎజెండాలో భాగంగా సమాచారం, భారీ సవాళ్లు, ఉపాయాలు' అన్న అంశంపై హాల్ 3లో నిర్వహించిన ప్లీనరీకి మంత్రి కె. తారకరామారావు వక్తగా విచ్చేసి ప్రసంగించారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

ఈ ప్లీనరీ అనంతరం మంత్రి కె తారాకరామరావు, కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు సాయంత్రం వరుసగా పారిస్, బెర్లిన్, జోహన్స్‌బర్గ్, ఇరాన్‌లోని మసద్,బ్రెజిల్‌లోని సావ్‌పోలా, బార్సిలోనా, తెహరన్ నగరాలకు చెందిన మేయర్లు, ప్రతినిధుల బృందంతో సుదీర్ఘ చర్చలు జరిపారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు, ప్రతిపాదనల రూపకల్పనలో సహాయం అందించేందుకు మొగ్గుచూపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

బార్సిలోనా మేయర్ గ్జావియర్ ట్రియస్, జెనీవా మేయర్ రెమీ పగానీ, జహన్స్‌బర్గ్ మేయర్ పార్క్స్ తౌ, విక్టోరియా మేయర్ జక్వైలిన్ వౌస్టాకె బెల్లె, ప్రపంచ బ్యాంకు సీనియర్ కన్సల్టెంట్ వికాస్ కనున్గో, బల్దియా కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు ప్రసంగించారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి డేటాబేస్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

పారదర్శకతను పెంపొందిస్తూ మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తమది కొత్త కొత్త యువ రాష్ట్రమైనందున, ఇక్కడి ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా, విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సిఎం కెసిఆర్ సంకల్పించినట్లు తెలిపారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

ఈ దిశగా ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకునేందుకు సమగ్ర సర్వే నిర్వహించినట్లు కెటిఆర్ తెలిపారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

ఈ ప్లీనరీ అనంతరం మంత్రి కె తారాకరామరావు, కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు సాయంత్రం వరుసగా పారిస్, బెర్లిన్, జోహన్స్‌బర్గ్, ఇరాన్‌లోని మసద్,బ్రెజిల్‌లోని సావ్‌పోలా, బార్సిలోనా, తెహరన్ నగరాలకు చెందిన మేయర్లు, ప్రతినిధుల బృందంతో సుదీర్ఘ చర్చలు జరిపారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

ఇందులో భాగంగా సావ్‌పోలా నగర బృందం హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు, ప్రతిపాదనల రూపకల్పనలో సహాయం అందించేందుకు మొగ్గుచూపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు, ప్రతిపాదనల రూపకల్పనలో సహాయం అందించేందుకు మొగ్గుచూపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

English summary
Smart cities should be able to offer smarter citizen services and Telangana State government has taken up the task of making Hyderabad a global smart city, IT Minister K. Taraka Rama Rao said here on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X