వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు:తెలంగాణా కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

తిరుమల:ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు హామీలు నెరవేర్చకుండా దొంగ చాటుగా తిరుగుతున్నారని వీహెచ్ ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలోనూ , కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చితీరుతుందని విహెచ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న వి.హనుమంతరావుకు టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో ఆయనను సత్కరించారు.

Special status is AP peoples right: Telangana Congress leader V.Hanumantha Rao

మరోవైపు నెల్లూరులో నవనిర్మాణ దీక్ష సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అడ్డగోలు గా విభజించడంతో అప్పుల బాధతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీక్షలు చేస్తుంటే, ఆస్తులు పొందిన తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలకు 2019 ఎన్నికల్లో ఓటు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపుని చ్చారు.

2019 లోపు కృ ష్ణ, గోదావరి నదుల అనుసంధానం చేసి తీరుతామన్నారు. బీజేపీతో పొత్తు ఉన్నంతవరకు చంద్రబాబును పొగిడిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు పనిగట్టుకుని ఆరోపణలు చేయడం దారుణమన్నారు. రాజ్యసభలో ఆమోదం పొందిన 24 అంశాలను గాలికి వదిలేసిన కేంద్ర ప్రభుత్వం, బిల్లులో లేని అంశాలకు నిధులు కేటాయించడం దారుణమన్నారు. ప్రధాని మోదీ ప్రజా స్వామ్యాన్ని కాలరాస్తూ నియంతలా వ్యవహ రిస్తున్నారని ఆరోపించారు.

English summary
Telangana: Telangana Congress leaders V.Hanumantha Rao made it clear that special status is the right of Andhra pradesh. TTD officials welcomed Mr. V.Hanumanthrao who visited Tirumala Lord Venkateswara Temple during the VIP's intermission on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X