వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
"పందుల పందేలు ఆడుకోండి, ప్రత్యేకహోదా అనేది ముగిసిన అద్యాయం'',నేను రడీ
హైద్రాబాద్ :జల్లికట్టు స్పూర్తి అయితే అదే ఆట ఆడుకోవాలి, లేకపోతే పందుల, కోళ్ళ పందేలు ఆడుకోవచ్చని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎపి సిఎం చంద్రబాబునాయుడు చూస్తు ఊరుకోరని కేంద్రమంత్రి సుజానా చౌదరి అభిప్రాయపడ్డారు.రాష్ట్రానికి ఏ సెక్షన్ కింద ఏ రూల్ కింద అన్యాయం జరిగిందో చెబితే తాను సమాధానం చెబుతానన్నారు.

ప్రత్యేక హోదా ముగిసిన అంశమని చెప్పారు సుజానాచౌదరి. గతంలో ఇదే కామెంట్ ను చేశారు కేంద్రమంత్రి సుజానా. మరోసారి ఇదే అంశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. విధ్యార్థులను, యువతను రెచ్చగొట్టకూడదని ఆయన కోరారు.
రాజకీయ పబ్బం గడుపుకొనేందుకుగానే కొందరు ఈ అంశాన్ని లేవనెత్తి అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.