వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడే దొరికిపోయారు, అదే చిక్కు తెచ్చింది: మహేష్ బాబు మౌనం వెనుక!

అనూహ్యంగా మహేష్ బాబు పేరు తెరపైకి వచ్చింది. దర్శకులు రామ్ గోపాల్ వర్మ.. ఆయనను టార్గెట్ చేశారు. మహేష్ బాబు వివాదాలకు దూరంగా ఉంటారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఊపందుకుంటోంది. జల్లికట్టు స్ఫూర్తిగా హోదా కోసం ఉద్యమించాలని విపక్ష నేతలు, పలువురు సునీ ప్రముఖులు కోరుకుంటున్నారు. జల్లికట్టుకు మెరీనా బీచ్ వేదక కాగా, హోదాకు విశాఖ ఆర్కే బీచ్ వేదిక అయింది.

మెగా టార్గెట్..: పర్సనల్ విషయాలతో పవన్ వర్సెస్ వర్మమెగా టార్గెట్..: పర్సనల్ విషయాలతో పవన్ వర్సెస్ వర్మ

ఈ నిరసనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, లెఫ్ట్, ప్రజా సంఘాలు అండగా నిలబడ్డాయి. వైసిపి అధినేత జగన్ స్వయంగా నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి, విశాఖ వచ్చినా, పోలీసులు ఆయన్ని వెనక్కి పంపించారు.

పలువురు సినీ ప్రముఖులు హోదా అంశానికి మద్దతు పలికారు. పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో ఉన్నారు. ఆయన మద్దతిచ్చారు.

 Special Status issue: behind Mahesh Babu silence?

ఇతర నటుల విషయానికి వస్తే శివాజీ హోదా ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. నటులలో అందరి కంటే ముందు గట్టిగా గొంతెత్తింది ఆయనే.

వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్, తనీష్, సంపూర్ణేష్ బాబు, శివబాలాజీ, నాగబాబు, రఘు కుంచె, గోపీచంద్ మలినేని తదితరులు మద్దతిచ్చారు.

అయితే, అనూహ్యంగా మహేష్ బాబు పేరు తెరపైకి వచ్చింది. దర్శకులు రామ్ గోపాల్ వర్మ.. ఆయనను టార్గెట్ చేశారు. మహేష్ బాబు వివాదాలకు దూరంగా ఉంటారు.

జగన్-పవన్ కళ్యాణ్ పోటాపోటీ: జనసేన చీఫ్ 'ఆ మాట', ఇక బాబుకు చిక్కులే!జగన్-పవన్ కళ్యాణ్ పోటాపోటీ: జనసేన చీఫ్ 'ఆ మాట', ఇక బాబుకు చిక్కులే!

అయితే, తమిళనాడులో జల్లికట్టు కోసం ఉద్యమం జరిగినప్పుడు మహేష్ బాబు స్పందించారు. ఇప్పుడు అదే ఆయనకు చిక్కులు తీసుకు వచ్చింది.

జల్లికట్టు కోసం మద్దతు పలికిన మహేష్ బాబు.. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదనేది వర్మ ప్రశ్న. ఆయన ప్రశ్నలోను అర్థముందని అంటున్నారు. అదే సమయంలో మహేష్ బాబు మౌనం వెనుక ఎన్నో కారణాలు ఉండి ఉంటాయని వాదనలు కూడా ఉన్నాయి.

గతంలో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగినప్పుడు వారు స్పందించిన సందర్భాలు లేవు. ఇఫ్పుడు కూడా అదే విధంగా మౌనం వహిస్తున్నారేమో అని అంటున్నారు.

మరో ఆసక్తికర విషయమేంటే.. ప్రత్యేక హోదాకు బదులు కేంద్రం ప్యాకేజీ ఇచ్చిందని టిడిపి చెబుతోంది. ఆ తెలుగుదేశం పార్టీలో మహేష్ బాబు బావ... గల్లా జయదేవ్ ఉన్నారు. ఆయన ఎంపీ కూడా. మహేష్ బాబు మౌనానికి అది కూడా కారణం కావొచ్చంటున్నారు. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ బాబు పేరును వర్మ లాగడం గమనార్హం.

English summary
Ram Gopal Varma has dragged Prince Mahesh Babu into Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X