వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటీకి అభ్య‌ర్దుల వ‌డ‌పోత : ప‌్ర‌త్యేక హోదానే ప్ర‌ధానాస్త్రం : అన్ని స్థానాల‌కు పోటీ..!

|
Google Oneindia TeluguNews

ఏపి కాంగ్రెస్ కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మ‌వేశంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాల‌ని డిసైడ్ అయ్యా రు. 175 అసెంబ్లీ స్థానాల‌కు..25 లోక్‌స‌భ స్థానాల‌కు ఆశావాహుల నుండి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించారు. దీని కోసం డిసిసి అధ్య‌క్షుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సీనియ‌ర్లు 25 ప్రాంతాల్లో హోదా భ‌రోసా యాత్ర నిర్వ‌హించాల‌ని స‌మావేశంలో తీర్మానించారు.

అన్ని స్థానాల్లో పోటీకి సిద్దం..

అన్ని స్థానాల్లో పోటీకి సిద్దం..

ఏపి కాంగ్రెస్ పార్టీ కీల‌క స‌మావేశం జ‌రిగింది. పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్‌చాందీ, కొప్పుల రాజు స‌మ‌క్షం లో జ‌రిగిన ఈ స‌మావేశంలో ఏఐసిసి నుండి వ‌చ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పిసిసి చీఫ్ ర‌ఘువీరా వివ‌రించారు. హైక‌మాండ్ ఆదేశాల మేర‌కు మొత్తం 175 అసెంబ్లీ నియోక‌వ‌ర్గాలు..25 లోక్‌స‌భ స్థానాల‌కు అభ్య‌ర్దులు బ‌రిలో ఉండాల‌ని స్ప‌ష్టం చే సారు. దీని కోసం ఆశావాహుల నుండి డిసిసి అధ్యక్షులు ద‌ర‌ఖాస్తులు..వారి వివ‌రాలు సేక‌రించి పిసిసి కి నివేదించాల ని సూచించారు.

ఫిబ్రవ రి నెలాఖ‌రులోగా

ఫిబ్రవ రి నెలాఖ‌రులోగా

పిసిసి స్థాయిలోని 21` మంది స‌భ్యుల బృందం వాటిని స్క్రూటిని చేసి ఏఐసిపి కి నివేదిస్తుంది. ఫిబ్రవ రి నెలాఖ‌రులోగా అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు స‌మావేశంలో ర‌ఘువీరా స్ప‌ష్టం చేసారు.

ప్ర‌త్యేక హోదానే అస్త్రంగా..

ప్ర‌త్యేక హోదానే అస్త్రంగా..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విభ‌జ‌న స‌మ‌యంలో నాటి యుపిఏ ప్ర‌భుత్వం ఇచ్చిన ఏపికి ప్ర‌త్యేక హోదా అమ‌లు పై ఇప్ప‌టికే పార్టీ అధినేత రాహుల్ గాంధీ స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలోనూ తీర్మానం చేసారు. ఈ అంశం ప్ర‌ధానాస్త్రంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయాల‌ని ఏపి కాంగ్రెస్ నిర్ణ‌యించింది. అభ్య‌ర్ధుల ఎంపిక ప్ర‌క్రియ ముగిసిన త‌రువాత 25 మంది కాంగ్రెస్ నేత‌లు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేయ‌నున్నారు. ఆ స‌మ‌యంలో హోదా తో పాటుగా విభ‌జ‌న అంశాల అమ‌లు కోసం ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రించేదీ ప్ర‌జ‌ల‌కు వివ‌రించనున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగం గా స్పంద‌న ఉన్న ప్రాంతాల్లో రాహుల్‌...ప్రియాంక స‌భ‌లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

English summary
APCC deicded to contest 175 Assembly seats and 25 Loksabha seats in AP. PCC chief Raghuveera suggested DCC presidents to concentrated on candidate selection process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X