వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడి నుంచి బస్సుల కొనుగోలు ఎందుకంటే.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుపట్టారు. అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టై.. బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన.. బుధవారం మీడియాతో మాట్లాడారు. అయితే బస్సుల కొనుగోలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘాలయ, నాగాలాండ్ నుంచి ఎందుకు బస్సులు కొనుగోలు చేశామో వివరించారు.

జస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై రాయరా? - జగన్ నోట తప్పులు -2వ తేదీలోగా ఈపని: ఎంపీ రఘురామజస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై రాయరా? - జగన్ నోట తప్పులు -2వ తేదీలోగా ఈపని: ఎంపీ రఘురామ

అక్రమ కేసులు.. సరికాదు...

అక్రమ కేసులు.. సరికాదు...

అక్రమ రిజిస్ట్రేషన్లు, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన పేరుతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు బెయిల్ మీద బయటకు రాగా.. అక్రమ కేసులు సరికాదన్నారు. అందరికీ సమన్యాయం జరగడం లేదన్నారు. అధికార పార్టీకి చెందిన వారిని వదిలేస్తున్నారని.. విపక్ష నేతలపై కక్షగట్టడం సరికాదన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు.

రాయితీలు ఉన్నందునే..

రాయితీలు ఉన్నందునే..

ప్రత్యేక హోదా గల రాష్ట్రాల్లో రాయితీలు ఉంటాయని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. అందుకే అక్కడ వాహనాలు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారని తెలిపారు. తాము కూడా మేఘాలయ, నాగాలాండ్‌లో వాహనాలు కొనుగోలు చేశామని వివరించారు. ఐటీ పన్ను ఉండదని.. మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. ఆ రాష్ట్రాల్లో స్లీపర్ బస్సుల్లో 36 సీట్లకు అనుమతిస్తారని గుర్తుచేశారు. కానీ ఏపీలో మాత్రం 30 సీట్లకే అనుమతి ఉంటుందని వివరించారు.

 అలా చేస్తే తప్పవుతోందా..?

అలా చేస్తే తప్పవుతోందా..?

అందుకోసమే మేఘాలయా నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నామని తెలిపారు. కానీ ఇలా చేసిన తప్పే అవుతోందని పేర్కొన్నారు. తమ లబ్ది కోసం పాటుపడితే దొంగ.. దొంగ అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ చట్టాలకు లోబడి నడుచుకుంటున్నామని వివరించారు. దేశంలో అందరికీ ఓకే చట్టాలు అమల్లో ఉంటాయి కదా అని ప్రశ్నించారు. మరీ అలాంటప్పుడు విమర్శలు చేయడం ఎందుకని అడిగారు.

Recommended Video

JC Prabhakar Reddy అరెస్ట్ | JC Travels పై ఇన్ని కేసులా ?
28 శాతం జీఎస్టీ చెల్లించి మరీ

28 శాతం జీఎస్టీ చెల్లించి మరీ

28 శాతం జీఎస్టీ చెల్లించి వాహనాలు కొనుగోలు చేస్తున్నామని ప్రభాకర్ రెడ్డి వివరించారు. మరీ అలాంటప్పుడు తమకు కాస్తో కూస్తో లబ్ది చూసుకుంటాం కదా అని అన్నారు. ఇలా చేస్తే తప్పు చేసినట్టా అని అడిగారు. అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి.. కుమారుడితో పాటు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బెయిల్ మీద బయటకు రాగా.. బుధవారం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు.

English summary
special status states are given discounts for registration of buses tdp leader jc prabhakar reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X