వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం చేయనంటారా, లీకులిస్తారా.. అసెంబ్లీలో అన్నీ చెప్తా: బీజేపీపై బాబు, అశోక్-సుజనల రిజైన్?

|
Google Oneindia TeluguNews

Recommended Video

No special status to AP : 2 Ministers may Quit Modi Cabinet

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని, ప్యాకేజీ, విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం తెలిపింది. దీనిపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ఉదయం టీడీపీ ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. బుధవారం లోకసభ ప్రారంభమైన 30 సెకండ్లకే వాయిదా పడింది.

రౌడీలను తీసుకొస్తారా, మీ పాత్ర ఉన్నట్లే, మేం నోరు విప్పితే: బాబుకు విష్ణు వార్నింగ్రౌడీలను తీసుకొస్తారా, మీ పాత్ర ఉన్నట్లే, మేం నోరు విప్పితే: బాబుకు విష్ణు వార్నింగ్

కేంద్రంపై ఎంపీలు అసహనం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలను లెక్కలు అడగకుండా ఏపీనే ఎలా అడుగుతారని, ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పాలని అనడం ఏమిటని టీడీపీ ఎంపీలు చంద్రబాబు వద్ద అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్యేలతో మాట్లాడిన అంశాలను ఎంపీలకు చెప్పారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకుందామన్నారు.

మోడీ! ఎ1 జగన్‌కు ఎలా ఇచ్చావ్, బిచ్చగాళ్లమా, పాకిస్తాన్ వాళ్లమా: టీడీపీ తీవ్రవ్యాఖ్యమోడీ! ఎ1 జగన్‌కు ఎలా ఇచ్చావ్, బిచ్చగాళ్లమా, పాకిస్తాన్ వాళ్లమా: టీడీపీ తీవ్రవ్యాఖ్య

బీజేపీతో వద్దని చెప్పారు

బీజేపీతో వద్దని చెప్పారు

నిధులపై లెక్క చెప్పలేదని కేంద్రం అనడం సరికాదని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో తాను ఈ అంశంపై మాట్లాడుతానని చెప్పారు. ఎంపీలు ఆందోళనలు పార్లమెంటులో కొనసాగించాల్సిందేనని చెప్పారు. తాను ఇప్పటికే మన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మాట్లాడానని చంద్రబాబు ఎంపీలకు చెప్పారు. 95 శాతం మంది ఎమ్మెల్యేలు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని చెప్పారని తెలిపారు.

 మాదీ అదే అభిప్రాయమని ఎంపీలు

మాదీ అదే అభిప్రాయమని ఎంపీలు

దానికి ఎంపీలు స్పందిస్తూ.. మేం కూడా అదే అభిప్రాయంతో ఉన్నామని చెప్పారు. చట్టంలో ఉన్నవి మాత్రమే అమలు చేయాలని మనం అడుగుతున్నామని చంద్రబాబు అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు, చట్టంలో ఉన్న వాటిని అమలు చేయమంటే సాధ్యం కాదని ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, పార్లమెంటులో తాము ఆందోళన చేస్తున్న సమయంలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సీటు నుంచి కదలలేదని టీడీపీ ఎంపీలు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. వైసీపీ తీరును ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.

 ఏపీకి ఏం చేయబోమని పరోక్షంగా చెబుతోంది

ఏపీకి ఏం చేయబోమని పరోక్షంగా చెబుతోంది

కేంద్రం ప్రజల మనోభావాలు పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం మాట తీరు ఏపీని అవమానించేలా ఉందని చెప్పారు. రాష్ట్రానికి ఏమీ చేయబోమని కేంద్రం పరోక్షంగా చెబుతోందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

ఇలా లీకులు ఇవ్వడం ఏమిటి

ఇలా లీకులు ఇవ్వడం ఏమిటి

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, ప్రత్యేక ప్యాకేజీ, గతంలో ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేస్తామని కేంద్రం చెప్పడం సరికాదని చంద్రబాబు అన్నారు. ఇది పరోక్షంగా లీకులు ఇవ్వడమే అన్నారు. ఇలా లీకులు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు.

మరింత ఒత్తిడి తీసుకురండి

మరింత ఒత్తిడి తీసుకురండి

విభజన హామీలపై కేంద్రం వైఖరిలో స్పష్టత వచ్చేలా సూచన చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశనం చేశారు. కేంద్రంపై పార్లమెంటు బయట, వెలుపల మరింత ఒత్తిడి పెంచాలని చంద్రబాబు అన్నారు. కేంద్రం చేసిన వాగ్ధానాలనే మనం అడుగుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మనం పోరాడుతున్నామని చెప్పారు.

 అసెంబ్లీలో ఇవాళ కేంద్రం వైఖరిపై మాట్లాడుతా

అసెంబ్లీలో ఇవాళ కేంద్రం వైఖరిపై మాట్లాడుతా

అసెంబ్లీలో ఇవాళ (బుధవారం) కేంద్ర ప్రభుత్వం వైఖరి, విధానాలను వివరిస్తానని చంద్రబాబు ఎంపీలతో చెప్పారు. రాష్ట్ర ప్రజలను అవమానించేలా కేంద్రం తీరు సరికాదన్నారు. చట్టంలో ఉన్న వాటిని అమలు చేసేందుకు కాలయాపన ఎందుకని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా మన పోరు ఉధృతం చేద్దామన్నారు.

కేంద్రమంత్రుల రాజీనామా

కేంద్రమంత్రుల రాజీనామా

ఇదిలా ఉండగా, ఏపీకి హోదా ఇవ్వమని కేంద్రం మరోసారి స్పష్టంగా తేల్చేయడంతో టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేయవచ్చునని, కేంద్రం నుంచి బయటకు రావొచ్చునని అంటున్నారు. చంద్రబాబు ఇవాళో రేపో ఈ నిర్ణయం ప్రకటిస్తారని చెబుతున్నారు.

English summary
With the Centre making it clear that special category status for Andhra Pradesh is not possible and most TDP MLAs and MLCs wanting the party to end its alliance with BJP, TDP president and chief minister N Chandrababu Naidu is likely to set the separation process in motion beginning with the resignation of two TDP ministers Ashok Gajapathi Raju and YS Chowdhary from the Narendra Modi cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X