వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిడ్డి ఈశ్వరీ ఎఫెక్ట్: 2019లో పాడేరు టిక్కెట్టెవరికీ, అమరావతికి పరుగు

విశాఖ జిల్లా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాడేరు: విశాఖ జిల్లా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో టిడిపికి చెందిన త్రిసభ్య కమిటీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడను కలిసేందుకు హుటాహుటిన అమరావతికి బయలుదేరి వెళ్ళారు.పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రవిబాబు ఎఫెక్ట్: అనుచరులతో గిడ్డి ఈశ్వరీ సమావేశం, జగన్‌కు షాకిచ్చేనా?రవిబాబు ఎఫెక్ట్: అనుచరులతో గిడ్డి ఈశ్వరీ సమావేశం, జగన్‌కు షాకిచ్చేనా?

విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ పార్టీ అధినేత జగన్‌తో పాటు కొందరు పార్టీ నేతలు అవలంభిస్తున్న వైఖరితో తీవ్ర మనోవేదనకు గురయ్యారని ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబును పార్టీలో చేర్చుకోవాలనే నిర్ణయంతో గిడ్డి ఈశ్వరీ అసంతృప్తితో ఉన్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది.

రివర్స్: విశాఖలో టిడిపికి చెక్ పెట్టేందుకు జగన్ ప్లాన్ ఇదే!రివర్స్: విశాఖలో టిడిపికి చెక్ పెట్టేందుకు జగన్ ప్లాన్ ఇదే!

ఈ పరిణామాలపై గిడ్డి ఈశ్వరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వద్ద కూడ తన నిరసనను వ్యక్తం చేశారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈశర్వి వైసీపీని వీడి టిడిపిలో చేరాలనే నిర్ణయానికి వచ్చారనే ప్రచారం సాగుతోంది. కానీ, గిడ్డి ఈశ్వరీ ఈ ప్రచారాన్ని మాత్రం ఖండిస్తున్నారు.

 బాబుతో సమావేశానికి టిడిపి త్రిసభ్య కమిటీ

బాబుతో సమావేశానికి టిడిపి త్రిసభ్య కమిటీ

పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపి త్రిసభ్య కమిటీ సభ్యులు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యేందుకు హుటాహుటిన అమరావతికి బయలుదేరి వెళ్ళారు.మాజీ మంత్రి ఎం.మణికుమారి, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొర్రా నాగరాజు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంవీవీఎస్‌.ప్రసాద్‌లు ఆదివారం లేదా సోమవారం నాడు చంద్రబాబునాయుడును కలిసే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ టిడిపిలో చేరాలనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో త్రిసభ్య కమిటీ బాబును కలవాలని నిర్ణయం తీసుకొన్నారని అంటున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఈశ్వరీ టిడిపిలో చేరే అవకాశాలు ఖాయమనే అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకలు వ్యక్తం చేస్తున్నారు.

 పార్టీ ఆదేశం మేరకే త్రిసభ్య కమిటీ అమరావతికి

పార్టీ ఆదేశం మేరకే త్రిసభ్య కమిటీ అమరావతికి

త్రిసభ్య కమిటీ సభ్యులకు రాజధానికి రావాలని అధిష్ఠానం నుంచి వర్తమానం అందింది. త్రిసభ్య కమిటీ సభ్యులు ముందుగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబుతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశం కానున్నారు. అయితే గిడ్డి ఈశ్వరీ టిడిపిలో చేరితే స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై పార్టీ నాయకత్వం చర్చించే అవకాశం లేకపోలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరికీ టిక్కెట్టు కేటాయించాలనే విషయమై కూడ పార్టీ నాయకత్వం నేతలతో చర్చించే అవకాశం లేకపోలేదు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఈశ్వరీని కాదని ప్రస్తుతం త్రిసభ్య కమిటీ సభ్యుల్లోని మణికుమారి లేదా ఇతరులకు టిక్కెట్టు కేటాయిస్తోందా లేదా అనే విషయాలపై కూడ చర్చించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

గిడ్డి ఈశ్వరీ టిడిపిలోకి...

గిడ్డి ఈశ్వరీ టిడిపిలోకి...

గిడ్డి ఈశ్వరీ టిడిపిలో చేరుతారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. నవంబర్ 27వ, తేదిన ఈశ్వరీ టిడిపిలో చేరే అవకాశం ఉందని పాడేరు నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ నాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్న ఈశ్వరీ పార్టీని వీడే యోచన చేస్తున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మరో వైపు ఈశ్వరి పార్టీలో చేరితే ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకొంటాయోననే చర్చ టిడిపి వర్గాల్లో సాగుతోంది. త్రిసభ్య కమిటీని అమరావతికి పిలిపించిన ఉద్దేశ్యం కూడ గిడ్డి ఈశ్వరి పార్టీలో చేరే విషయమై చర్చించేందుకే ఉండవచ్చనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

2019లో పాడేరు టిక్కెట్టు ఎవరికీ?

2019లో పాడేరు టిక్కెట్టు ఎవరికీ?

టిడిపిలో గిడ్డి ఈశ్వరీ టిడిపిలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో 2019లో పాడేరు టిడిపి టిక్కెట్టు ఎవరికి దక్కుతోందోననే చర్చ ప్రస్తుతం సాగుతోంది. అయితే ఇప్పటివరకు టిడిపిలో ఉన్నవారిని కాదని పార్టీలో చేరిన గిడ్డి ఈశ్వరికీ 2019 ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టును కేటాయిస్తారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ విషయాలన్నింటిని చర్చించేందుకే త్రిసభ్య కమిటీని అమరావతికి పిలిపించారనే ప్రచారం సాగుతోంది.

English summary
The differences between Paderu MLA Giddi Eswari and YSR Congress Party president Y.S. Jagan Mohan Reddy appear to have reached a flashpoint with the MLA threatening to quit the party. But she was non-committal on whether she would join the Telugu Desam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X