కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ని కలవనివ్వట్లేదు, సాయి వల్లే: గిడ్డి తర్వాత మరో ఇద్దరు, చక్రం తిప్పిన జవహర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డితో పాటు పలు కారణాల వల్ల తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సన్నిహితుల వద్ద తన ఆవేదన వెళ్లగక్కుతు

|
Google Oneindia TeluguNews

Recommended Video

YSRCP MLA Giddi Eswari Joining TDP Today | Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డితో పాటు పలు కారణాల వల్ల తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సన్నిహితుల వద్ద తన ఆవేదన వెళ్లగక్కుతున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీలో ఆమె చేరిక దాదాపు ఖరారైంది.

వైసీపీకి మరో షాక్, జగన్ తీరుపై అసహనం: టీడీపీలోకి కర్నూలు ముఖ్య నేతవైసీపీకి మరో షాక్, జగన్ తీరుపై అసహనం: టీడీపీలోకి కర్నూలు ముఖ్య నేత

 సోమ లేదా మంగళవారం టీడీపీలోకి

సోమ లేదా మంగళవారం టీడీపీలోకి

సోమవారం ఉదయం ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె పచ్చ కండువా కప్పుకోనున్నారు. లేదంటే మంగళవారం టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు రోజుల్లో మాత్రం సైకిల్ ఎక్కుతారని చెబుతున్నారు.

 జగన్ పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు

జగన్ పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు

విశాఖ జిల్లాలో అభివృద్ధి తనకు ముఖ్యమని, కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని ఈశ్వరి ఆదివారం వెల్లడించారు. తాను పార్టీ మారితేనే పాడేరు అభివృద్ధికి బాటలు పడతాయన్నారు. తనలాంటి వారిని జగన్ పక్కన పెట్టడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది.

వైసీపీ బుజ్జగింపులకు నో,

వైసీపీ బుజ్జగింపులకు నో,

అరకులో తాను చెప్పిన వ్యక్తిని కాకుండా వేరేవారిని ఇంచార్జిగా నియమించడం, నియోజకవర్గంలో తన మాట కాకుండా వేరేవారికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఆమె పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ నేతలు ఈశ్వరిని బుజ్జగించే ప్రయత్నం చేసినా, ఆమె ససేమీరా అన్నారని తెలుస్తోంది. జగన్‌ను కలిసేందుకు కూడా ఆమెకు అనుమతి దొరకడం లేదని తెలుస్తోంది. కొందరు పార్టీ నాయకులు తనపై కుట్ర చేస్తున్నారని ఆమె వాపోతున్నారు.

 చక్రం తిప్పిన మంత్రి జవహర్

చక్రం తిప్పిన మంత్రి జవహర్

తనకు టీడీపీలో చేరాలని ఉంటే రెండేళ్ల క్రితమే చేరేదానిని అని, రెండేళ్లుగా టీడీపీ తనను అడుగుతోందని ఈశ్వరి చెప్పారని తెలుస్తోంది. వైసీపీలోని మార్పుల వల్ల తాను పార్టీ మారే పరిస్థితులు వస్తున్నాయని చెబుతున్నారట. కాగా, ఈశ్వరి టిడిపిలోకి రావడం వెనుక మంత్రి జవహర్ చక్రం తిప్పారని తెలుస్తోంది.

 వరుసలో మరో ఇద్దరు

వరుసలో మరో ఇద్దరు

గిడ్డి ఈశ్వరి తర్వాత ఈ వారంలోనే మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పచ్చ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. వారు ఎవరనే విషయం తేలాల్సి ఉంది. ఇటీవల కొందరు వైసిపి నేతలు సొంత పార్టీ పైనే విమర్శలు చేసిన వారు ఉన్నారు. దీంతో ఆ ఇద్దరు ఎవరనే చర్చ సాగుతోంది.

English summary
The differences between Paderu MLA Giddi Eswari and YSR Congress Party president YS Jagan Mohan Reddy appear to have reached a flashpoint with the MLA threatening to quit the party. But she was non-committal on whether she would join the Telugu Desam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X