• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బద్నాం చేయడానికేనా?: అఖిలను తప్పిస్తే టీడీపీకే డ్యామేజ్, అది జరిగే పనేనా?

|
  Bhuma Akhila Priya Ministry Is In Suspense అఖిలప్రియ మంత్రి పదవికి ఎసరు.. | Oneindia Telugu

  కర్నూలు: రాజకీయాలకు కొత్తే అయినా.. నంద్యాల ఉపఎన్నికలో సోదరుడిని గెలిపించుకోవడం ద్వారా అఖిలప్రియ తన సత్తా ఏంటో చాటారు. ఒకవిధంగా నంద్యాల రాజకీయం ఆమె రాజకీయానుభవానికి పదును పెట్టింది.

  అంతకుముందు పార్టీలోని సీనియర్ల అసంతృప్తిని, పని తీరు సరిగా లేదన్న అపవాదును మూటగట్టుకున్న అఖిలప్రియ.. నంద్యాల ఉపఎన్నికతో విమర్శలకు చెక్ పెట్టింది. దాంతో ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

  ఈ నేపథ్యంలో అఖిలప్రియకు పదవి గండం అంటూ మరోసారి కథనాలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇది వాస్తవమేనా.. లేక పనిగట్టుకుని అఖిలప్రియను బద్నాం చేసే పనిని కొంతమంది కావాలనే ముందేసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

   ఎక్కడిదీ ప్రచారం:

  ఎక్కడిదీ ప్రచారం:

  టీడీపీ ప్రత్యర్థి వర్గం నుంచే ఈ ప్రచారం మొదలైనట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అంటే బిజీగా ఉండి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనుకున్నాం కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంటే ఎలా? అని టీడీపీ అధిష్టానం అఖిలపై గుర్రుగా ఉన్నట్లు ఆ కథనాలు వస్తున్నాయి. మంత్రిగా అఖిల క్లియర్ చేయాల్సిన చాలా ఫైల్స్ ఆఫీసులో పేరుకుపోయాయని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి అధికార పార్టీ నుంచి ఏ మేర సమాచారం ఉందన్న దానిపై స్పష్టత లేదు. దీంతో ఈ కథనాలపై చాలామందికి నమ్మకం కుదరని పరిస్థితి.

  బద్నాం చేయడానికే:

  బద్నాం చేయడానికే:

  ఎన్నికల్లో అఖిలప్రియను ఓడించలేకపోవడంపై ప్రత్యర్థి పార్టీ తీవ్ర అసహనంతో ఉంది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రోజా ఆమెపై వ్యక్తిగతంగా విరుచుకుపడి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారు. ఎంత చేసినా.. ఫలితం అఖిలకే అనుకూలంగా రావడంతో ప్రత్యర్థులు ఆమెపై పీకల్లోతు ఆగ్రహం పెంచుకున్నారు. దానికి బదులు తీర్చుకునేందుకు ఇలాంటి పసలేని కథనాలతో ఆమెను బద్నాం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

  రాటుదేలుతారా? చతికిలపడుతారా?: అఖిలకు రెండే ఆప్షన్స్.. ఉపఎన్నిక సవాల్!

  నిజంగా జరిగే పనేనా?:

  నిజంగా జరిగే పనేనా?:

  తల్లి మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం, ఆపై తండ్రి మరణంతో అనుకోకుండా మంత్రి అవడంతో అఖిలప్రియ రాజకీయాలు సెంటిమెంటు పునాది గానే ప్రారంభమయ్యాయి. అయితే నంద్యాల ఉపఎన్నిక ద్వారా ఆ సెంటిమెంటుకు తోడు తన చరిష్మాను నిరూపించుకునే అవకాశం కూడా ఆమెకు దక్కింది.

  ఏమాత్రం అనుభవం లేని తనం నుంచి పార్టీని గెలిపించడంలో అఖిలప్రియ కూడా కీలక పాత్ర పోషించింది. ఒకవేళ ఫలితం తేడా ఉంటే టీడీపీ కూడా ఆమె పట్ల నిర్దయగా వ్యవహరించేదేమో కానీ.. నంద్యాల గెలుపు పార్టీలో ఆమె ప్రాధాన్యతకు అనివార్యతను ఏర్పరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనుకోవడం అంత నమ్మశక్యంగా లేని అంశం.

   అదే జరిగితే టీడీపీకే డ్యామేజ్:

  అదే జరిగితే టీడీపీకే డ్యామేజ్:

  ఒకవేళ ఈ కథనాలే నిజమై.. అఖిలప్రియను మంత్రి పదవి నుంచి తప్పించినా.. అది టీడీపీకే చెడ్డ పేరు తీసుకొచ్చేదవుతుంది తప్ప మరొకటి కాదు. పైగా అఖిలప్రియ మీద జనాల్లో మరింత సానుభూతి పెరగవచ్చు. అటు ప్రత్యర్థి పార్టీ కూడా దీన్ని వాడుకోవడానికి సిద్దంగా ఉంటుంది. ఎన్నికల్లో గెలుపు కోసమే ఆమెకు మూన్నాళ్ల ముచ్చటగా మంత్రి పదవి కట్టబెట్టారని ప్రచారం చేస్తుంది. ఈ విషయాల్ని టీడీపీ విస్మరిస్తుందని అనుకోలేం. కాబట్టి అఖిలప్రియను మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.

  English summary
  Speculations are widely spreading over Akhilapriya's Ministry, those are confine that may she lost her ministry in soon
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X