• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం జగన్ అనూహ్య నిర్ణయం : శాసన మండలి ఛైర్మన్ ఖరారు: ఎంపిక వెనుక అసలు లెక్క..!!

By Lekhaka
|

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు శాసన మండలి ఛైర్మన్ గా వ్యవహరించిన మహ్మద్ షరీఫ్ పదవీ విరమణ చేసారు. ఆయన టీడీపీ నుండి ఎమ్మెల్సీగా నియమితులై..టీడీపీ హయాంలో మండలి ఛైర్మన్ అయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల వ్యవహారంలో నాటి మండలి ఛైర్మన్ తీరు వివాదాస్పదమైంది. అయినా..సీఎం జగన్ కొత్త ఛైర్మన్ ను నియమించే ప్రయత్నం చేయలేదు. శాసనమండలిలో టీడీపీ సంఖ్య అధికంగా ఉండటంతో..ప్రభుత్వ బిల్లులను అడ్డుకుంటున్నారనే ఆగ్రహంతో ఏకంగా మండలి రద్దుకే అసెంబ్లీ జగన్ తీర్మానం చేసారు. ఇక, ఇప్పడు వరుసగా వైసీపీ అభ్యర్దులతో మండలిలో పార్టీ ఆధిపత్యం పెరుగుతోంది.

 ఛైర్మన్ ఎంపికలో పక్కా సమీకరణం..

ఛైర్మన్ ఎంపికలో పక్కా సమీకరణం..


ఇదే క్రమంలో మండలి ఛైర్మన్.. వైస్ ఛైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఛైర్మన్ పదవీ విరమణ చేయగా..డిప్యూటీ ఛైర్మన్ ఈ నెలలోనే పదవీ కాలం ముగియనుంది. అయితే, మండలి ఛైర్మన్ పదవి ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ ఇప్పటి వరకు పార్టీలో కొనసాగుతోంది. అనూహ్యంగా ముఖ్యమంత్రి మండలి ఛైర్మన్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మండలిలో గవర్నర్ నామినేటెడ్ కోటా లో ఈ రోజు ఖాళీ అవుతున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త వారి నియామకానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ సైతం పూర్తి చేసారు. నాలుగు పేర్లను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. అందులో కడప జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందిన రమేష్ యాదవ్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యా మోషేన్ రాజు, తూర్పు గోదావరి జిల్లా కాపు వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు, గుంటూరు జిల్లా రెడ్డి వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. ఇదే సమయంలో మండలి ఛైర్మన్ పదవి సైతం భర్తీ చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వస నీయ సమాచారం.

మోషేన్ రాజుకు ఛైర్మన్ పదవి

మోషేన్ రాజుకు ఛైర్మన్ పదవి

అనూహ్యంగా ఇప్పటి వరకు మండలి ఛైర్మన్ గా ఉన్న షరీష్ సొంత జిల్లా పశ్చిమ గోదావరికే మరలా మండలి ఛైర్మన్ పదవి దక్కనున్నట్లు పార్టీ ప్రముఖుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే శాసనసభ స్పీకర్ గా ఉత్తరాంధ్ర ప్రాంతం..బీసీ వర్గానికి ఇవ్వటంతో.. ఇప్పుడు గోదావరి జిల్లాలకు చెందిన ఎస్సీ వర్గానికి మండలి ఛైర్మన్ కేటాయిస్తున్నారు. సామాజిక సమీకరణాల విషయంలో పక్కాగా ఉండే సీఎం జగన్ మండలి డిప్యూటీ ఛైర్మన్ మైనార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. ఇక, కొయ్యా మోషేన్ రాజు వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీలో కీలకంగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కొవ్వూరు నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి టీవీ రామారావు చేతిలో ఓడిపోయారు. 2012 నుండి వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుండి టిక్కెట్ ఆశించినా తానేటి వనితకు టిక్కెట్ ఖరారైంది.

గోదావరి జిల్లాలకు ప్రాధాన్యత..

గోదావరి జిల్లాలకు ప్రాధాన్యత..


దీంతో అప్పుడు టీడీపీలో చేరారు. తిరిగి రెండు నెలల కాలంలోనే వైసీపీలోకి తిరిగి వచ్చేసారు. జిల్లాలోని రిజర్వ్ నియోజకవర్గాలైన గోపాలపురం, కొవ్వూరు ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు పని చేసారు. అయితే, 2019 ఎన్నికల సమయంలో టిక్కెట్ ఆశించిన మోషేన్ రాజుకు అప్పట్లోనే జగన్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇప్పటికే అదే జిల్లా నుండి ఎస్సీ వర్గానికి చెందిన తానేటి వనిత మంత్రిగా ఉన్నారు. కాపు వర్గానికి చెందిన ఆళ్ల నాని డిప్యూటీ సీఎంగా.. క్షత్రియ వర్గానికి చెందిన రంగనాధ రాజు మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక, ఇప్పుడు మరో ఎస్సీకి మండలి ఛైర్మన్ పదవి ఇవ్వటం ద్వారా జిల్లాలో ఇచ్చిన ప్రాధాన్యత స్పష్టం అవుతోంది. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా..ఈ నియామకానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
CM Jagan decided to appoint Moshen Raju as chairman for legislative council. He represents Sc community from West Godavari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X