• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Kanaka Durga flyover: ఇక నెలన్నరే: కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యేనా? పరిశీలించిన కలెక్టర్

|

విజయవాడ: కనక దుర్గమ్మ ఫ్లైఓవర్ పై గుడ్ న్యూస్ ను అందించారు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. కొత్త సంవత్సరం కానుకగా.. జనవరి నాటికి ఈ ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. జనవరి 1 నాటికి వాహనాల రాకపోకలు సాగించేలా ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులను బుధవారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు. జాతీయ రహదారుల నిర్మాణ అథారిటీ, రోడ్లు-భవనాల శాఖ జిల్లా అధికారులతో కలిసి ఆయన నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.

కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. మరో నెలన్నర రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదనే ఉద్దేశంతోనే తాను ఫ్లైఓవర్ ను పరిశీలించినట్లు చెప్పారు. ప్రతి నెలా ఫ్లైఓవర్ నిర్మాణంలో పురోగతిపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారని, ఇందులో భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణంతో సంబంధం ఉన్న ప్రతి శాఖాధికారులు, విభాగాధిపతులు తరచూ నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సి ఉందని ఇంతియాజ్ తెలిపారు.

Speed up Kanaka Durga flyover, says Krishna district Collector Imtiaz

హైదరాబాద్‌- చెన్నై జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ కనకదుర్గమ్మ దేవాలయం మీదుగా నిర్మిస్తోన్న ఈ ఫ్లైఓవర్.. స్థల సేకరణ విషయం నుంచీ పనులు నత్తనడకనే సాగుతోన్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల రోడ్ల విస్తరణ చేపట్టాల్సి రావడం, మరి కొన్ని ప్రాంతాల్లో ప్రార్థనా స్థలాలు ఉండటం వంటి ఇబ్బందుల వల్ల నామమాత్రంగా కూడా పనుల్లో పురోగతి కనిపించలేదు. రాష్ట్రంలోనే తొలి ఆరు లేన్ల సామర్థ్యంతో రూపుదిద్దుకుంటోన్న ఈ ఫ్లైఓవర్ ను జనవరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులోకి తీసుకుని రావాలని ప్రభుత్వం జిల్లా పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసింది.

Speed up Kanaka Durga flyover, says Krishna district Collector Imtiaz

ఈ నేపథ్యంలో- నిర్మాణ పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం స్వయంగా జిల్లా కలెక్టరే నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ రహదారుల నిర్మాణ అథారిటీ, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ సంయుక్తంగా ఈ ఫ్లైఓవర్ ను నిర్మిస్తున్నాయి. దీనికోసం ఇప్పటి వరకూ 253 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. తన వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం 154 కోట్లను మంజూరు చేసింది. మరిన్ని నిధులు విడుదల కావాల్సి ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Krishna district Collector Imtiaz has directed officials concerned to speed up works for Kanaka Durga flyover and others related to the national highway so as to curb traffic snarls in the city. The Collector Wednesday visits the flyover along with officials of the National Highway Authority of India (NHAI), and R&B.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more