వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేస్తుందేంటి: కెసిఆర్‌కి శ్రవణ్ సూటి ప్రశ్న, కర్నె కంటతడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sravan Kumar
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గొంతుకగా ఉన్న తనకు తెలంగాణ రాష్ట్ర సమితిలో తీవ్ర పరాభవం జరిగిందని, డబ్బు మూటలు అప్ప జెప్పినవారికే ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు టికెట్లు ఇస్తున్నారంటూ ఆ పార్టీని వీడిన దాసోజు శ్రవణ్ కుమార్ శనివారం నిప్పులు చెరిగారు.

పోరాడిన వారికే కత్తి ఇవ్వాలని చెప్పిన కెసిఆర్ చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పితికితే వస్తాయా? అని ప్రశ్నించిన కెసిఆర్ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు బాగుందా అన్నారు. తనను కులం పేరుతో అవమానిస్తారా అని మండిపడ్డారు. తన కులానికి చెందిన కుటుంబాలు ఊరికి రెండు కూడా ఉండవని, ఇక ఎలా గెలుస్తావని కెసిఆర్ తనను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెరాసలో కుటుంబ పాలన, నియంతృత్వ ధోరణి వల్లనే తాను ఆ పార్టీని వీడినట్లు చెప్పారు. పార్టీ కోసం తానెంతగానో కృషి చేసినా సరైన ప్రాతినిథ్యం దక్కలేదన్నారు. దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయనకు ప్రధాన అధికార ప్రతినిధి పదవిని ఇచ్చారు.

శ్రవణ్ కుమార్‌తో పాటు తెరాస హైదరాబాద్ నగర అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ కాచం సత్యనారాయణ, జనగామ టిడిపి తిరుగుబాటు అభ్యర్థి మండల శ్రీరాములు తదితరులు కాంగ్రెసు పార్టీలో చేరారు. వారికి జైరాం రమేష్ కండువా కప్పి ఆహ్వానించారు.

మరో నేత కర్నె ప్రభాకర్ అంతకుముందు తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెరాస అనే విత్తనాన్ని నాటి, నీళ్లు పోసి మొక్కగా పెంచి... మహావృక్షం చేశామని, ఈ మహావృక్షానికి చెదలు పట్టిందేమో అని విమర్శించారు. తెరాస నుంచి టికెట్ రానందుకు బాధగా ఉందని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

English summary
Dasoju Sravan Kumar joined in Congress party in the presence of Jairam Ramesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X