విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీచైతన్య, నారాయణల మధ్య ర్యాంకుల చిచ్చు..."నారాయణ"వి చిల్లరపనులు:బివిరావు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ: శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల మధ్య ర్యాంకుల విషయమై వివాదం చెలరేగింది. తమ సంస్థకు వచ్చిన ర్యాంకులను కూడా నారాయణ సంస్థ వారికి వచ్చినట్లుగా ప్రకటించుకుంటోందని శ్రీచైతన్య విద్యాసంస్థల అధిపతి బిఎస్ రావు ఆరోపించారు.

విజయవాడ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ విద్యాసంస్తలపై శ్రీచైతన్య విద్యాసంస్థల అధిపతి బిఎస్ రావు తీవ్ర విమర్శలు చేశారు. శ్రీచైతన్య, నారాయణ ఉమ్మడి సంస్థ చైనా బ్యాచ్ గతంలోనే రద్దయిపోయిందని, ఆ విషయాన్ని తాను పలు సార్లు పెద్దల సమక్షంలో, మీడియా సముఖంగా కూడా చెప్పినట్లు బిఎస్ రావు స్పష్టం చేశారు.

Sri Chaitanyas allegations against Narayana Inistitutions

అయినా ఒప్పందాన్ని ఉల్లంఘించి శ్రీచైతన్యలో చదివిన విద్యార్థులను తమ విద్యార్థులుగా నారాయణ విద్యాసంస్థ చెప్పుకుంటోందని ఆయన ఆరోపించారు. జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ లో టాప్ 5 ర్యాంకుల తమవేనని శ్రీచైతన్య అధినేత బీవీ రావు స్పష్టం చేశారు. అయినా ఆ విద్యార్థులను వారి విద్యార్థులుగా పేర్కొంటూ నారాయణ సంస్థ ప్రకటనలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విధంగా నారాయణ విద్యాసంస్థ చిల్లర పనులు చేస్తోందని బీఎస్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము మరోసారి ఒక విషయం స్పష్టం చేస్తున్నామని, ఇకపై చైనా బ్యాచ్ లు అనేవి ఉండవని పునరుద్ఘాటించారు. నారాయణ తప్పుడు ప్రచారాలకు పాల్పడితే ఆ సంస్థలపై కేసులు పెట్టాల్సివస్తుందని శ్రీచైతన్య విద్యాసంస్థల అధిపతి బిఎస్ రావు ఈ సందర్భంగా హెచ్చరించారు. నారాయణ తమపై గతంలో అకారణంగా కేసులు పెట్టి వేధించిందని, తాము మాత్రం పక్కా ఆధారాలతో కేసులు పెడతామని స్పష్టం చేశారు.

English summary
Vijayawada:Old enemies in education sector but joined hands for some time to run their corporate institutions across the state have again started their old animosities attacking each other with the background of students ranks. Sri Chaitanya owner B.S.Rao alleges that Narayana has shown their rankings to their rankings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X