విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరొకరి చేతిలోకి శ్రీ చైతన్య విద్యాసంస్థలు..? రూ.8వేల కోట్లకు డీల్..?

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా తమ విద్యాసంస్థలను స్థాపించిన శ్రీచైతన్య విద్యాసంస్థలను త్వరలోనే మరో సంస్థ కొనుగోలు చేయనుందా.. అంటే ఔననే సమాదానం వినిపిస్తోంది. ప్రతిష్టాత్మక శ్రీచైతన్య విద్యాసంస్థలను ఎవరు కొనుగోలు చేస్తున్నారు..? ఎంతకు కొనుగోలు చేస్తున్నారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తిట్టారని పారిపోయిన నలుగురు శ్రీచైతన్య విద్యార్థులు;ఇక చదవలేనని విద్యార్ధిని ఆత్మహత్యతిట్టారని పారిపోయిన నలుగురు శ్రీచైతన్య విద్యార్థులు;ఇక చదవలేనని విద్యార్ధిని ఆత్మహత్య

 1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలు ప్రారంభం

1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలు ప్రారంభం

శ్రీ చైతన్య విద్యాసంస్థలు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ కేంద్రంగా 1986లో ప్రారంభించారు. ముందుగా బాలికల కాలేజీతో ప్రారంభమైన ఈ సంస్థలు ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా ప్రారంభమై తమ మార్క్‌ను చూపించాయి. ఈ విద్యాసంస్థలను ప్రారంభించింది డాక్టర్ బోపన్న సత్యనారాయణ రావు మరియు డాక్టర్ బోపన్న ఝాన్సీ లక్ష్మీబాయ్. ప్రస్తుతం శ్రీ చైతన్య స్కూల్స్ వివిధ రాష్ట్రాల్లో దాదాపు 700 ఉన్నాయి. ఇప్పుడు ఈ సంస్థలను మరో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్రూక్‌ఫీల్డ్, కల్పతీ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉన్న శ్రీ చైతన్య స్కూళ్లను మొత్తం 1.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.8వేల కోట్లు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్రూక్‌ఫీల్డ్ అండ్ కల్పతీ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ ఆసక్తి చూపుతున్నట్లు జాతీయ పత్రికలో కథనం ప్రచురితమైంది.

 2011లో న్యూసిల్క్ రూట్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ పెట్టుబడులు

2011లో న్యూసిల్క్ రూట్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ పెట్టుబడులు

ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ న్యూసిల్క్ రూట్ అనే సంస్థ 2011లో శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో 25 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం తన పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెట్టుబడుల ప్రక్రియ 8 ఏళ్లకు పైగా అయినందున బయటకు న్యూసిల్క్‌ రూట్ సంస్థ బయటకు వచ్చేందుకు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాధారణంగా పబ్లిక్ ఈక్విటీలు ఒక సంస్థలో పెట్టుబడులు పెట్టాయంటే ఇన్వెస్ట్ చేసిన నాటినుంచి అది ఏడేళ్ల వరకు మాత్రమే ఉంటాయి. అయితే ఇందులో మాత్రం 8ఏళ్లు దాటాయి. ప్రైవేట్ ఈక్విటీతో పాటు 27శాతం వాటాలు కలిగి ఉన్న ప్రమోటర్లు సైతం బయటకు వచ్చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సరైన ప్రమోటర్ల కోసం వెతకాల్సిపెట్టాల్సిందిగా బాధ్యతను ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఈవైకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

 ఆసక్తి చూపుతున్న కల్పతి ఇన్వెస్ట్‌మెంట్స్, బ్రూక్‌ఫీల్డ్..?

ఆసక్తి చూపుతున్న కల్పతి ఇన్వెస్ట్‌మెంట్స్, బ్రూక్‌ఫీల్డ్..?

ఈ ప్రక్రియలో భాగంగానే చెన్నైకు చెందిన కల్పతి ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ శ్రీ చైతన్య స్కూళ్లను కొనుగోలు చేసేందుకు పావులు కదిపింది. అయితే కొన్ని కారణాలతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ తెరపైకి వచ్చింది. శ్రీ చైతన్య స్కూళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రెండు పార్టీల నుంచి రాలేదు. కల్పతి ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ సురేష్ కూడా దీనిపై కామెంట్ చేసేందుకు అందుబాటులో లేరు. అయితే ఈ స్థాయిలో స్కూళ్లను ఇంత భారీ మొత్తంతో కొనుగోలు చేయాలంటే మూమూలు విషయం కాదు. దీనికోసం పలు ప్రభుత్వ ఏజెన్సీల నుంచి అనుమతులు రావాల్సి ఉంది.

మొత్తానికి ఇలాంటి పెద్ద విద్యాసంస్థలను కొనుగోలు చేసే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు సూరత్‌లో ఓ కోచింగ్ సంస్థలో మంటలు చెలరేగి 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుచేస్తున్నారు.

English summary
శ్రీ చైతన్య విద్యాసంస్థలు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ కేంద్రంగా 1986లో ప్రారంభించారు. ముందుగా బాలికల కాలేజీతో ప్రారంభమైన ఈ సంస్థలు ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా ప్రారంభమై తమ మార్క్‌ను చూపించాయి. ఈ విద్యాసంస్థలను ప్రారంభించింది డాక్టర్ బోపన్న సత్యనారాయణ రావు మరియు డాక్టర్ బోపన్న ఝాన్సీ లక్ష్మీబాయ్. ప్రస్తుతం శ్రీ చైతన్య స్కూల్స్ వివిధ రాష్ట్రాల్లో దాదాపు 700 ఉన్నాయి. ఇప్పుడు ఈ సంస్థలను మరో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్రూక్‌ఫీల్డ్, కల్పతీ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. న
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X