• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిరు సూపర్ర్! పగలు, ప్రతీకారాలు కాదు ‘జగన్ గారూ’ అంటూ శ్రీరెడ్డి సంచలనం, కీలక సూచనలు

|

అమరావతి: సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సినీ నటి శ్రీరెడ్డి.. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దృష్టి సారించారు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఇప్పుడు ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి పలు కీలక సూచనలు చేశారు.

'సైరా'ను కలవడం సంతోషమంటూ వైఎస్ జగన్: అభిమానులు ఫుల్ హ్యాపీ'సైరా'ను కలవడం సంతోషమంటూ వైఎస్ జగన్: అభిమానులు ఫుల్ హ్యాపీ

పెట్టుబడులపై ఫోకస్..

రాష్ట్రానికి సాధ్యమైనంత త్వరగా పెట్టుబడులు రాబట్టాలని ఆమె వ్యాఖ్యానించారు. అందుకోసం యువకుడైన సీఎం జగన్ పెట్టుబడులపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఈ పనిచేస్తే చాలా సమస్యలు తొలగిపోతాయని అన్నారు.

పగలు, ప్రతీకారాలు కాదు..

పారిశ్రామిక పురోగతి, వ్యవసాయ రంగా అభివృద్ధి రాష్ట్రానికి వెన్నెముక... పగలు, ప్రతీకారాలు కావని సీఎం జగన్మోహన్ రెడ్డికి హితబోధ చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మీరు బాధ్యాయుతమైన తండ్రిలాంటి వారని జగన్మోహన్ రెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించారు.

గొప్ప వ్యక్తులు, సంస్థలు రావాలంటే..

అందమైన హరిత నగరాలను నిర్మించండి.. టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురండి.. పర్యాటకాన్ని పెంపొందించండి.. అప్పుడే గొప్ప వ్యక్తులు, సంస్థలు రాష్ట్రానికి తరలివస్తాయని శ్రీరెడ్డి.. సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు.

అంబానీ లాంటి వారితో.. జగన్ ఒంటరి కాదు

రాష్ట్రంలో విద్యుత్ కోతల గురించి కూడా శ్రీరెడ్డి ప్రస్తావించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంబానీ లాంటి వ్యక్తుల సహాయం తీసుకోండి.. మనశత్రువులెవరో తెలుసు కానీ అంటూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శ్రీరెడ్డి సూచించారు. జగన్ ఒంటరి కాదని.. జగన్ అంటే జగమ్.. జనం అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు.

చిరు సూపర్ర్..

‘చిరు సూపర్ర్.. వైఎస్సార్సీపీ మేమందరం మీకు ఫుల్ సపోర్ట్ అంటూ శ్రీరెడ్డి'అని ఓ పోస్టు చేశారు. సోమవారం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సైరా నరసింహా రెడ్డి సినిమాను చూడాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి కోరారు. దీనికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. చిరును కలవడం సంతోషంగా ఉందంటూ జగన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు.

జగన్ గారూ.. అది చాలా ప్రమాదకరం..

ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో క్రీడలు, కళలు, సంగీతం, కిక్ బాక్సింగ్, క్రికెట్ లాంటివి ఉండాలని, వాటి కోసం మైదానం ఉండాలని.. ఇవి భవిష్యత్‌లో పౌరులకు ఒత్తిడిని దూరం చేస్తాయని.. ఇందు కోసం సీఎం జగన్ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం పిల్లలు మొబైల్ గేమ్‌లకే పరిమితమవుతున్నారని.. అది చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

లైంగిక వేధింపుల ఫిర్యాదు బాక్సులు..

లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, ముఖ్యంగా కాలేజీల్లోని వాష్‌రూంలలో ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలని, ఫిర్యాదులను రహస్యంగా ఉంచి, నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని శ్రీరెడ్డి సూచించారు.

జగన్ గారూ స్నేహ పూర్వకంగా ఉండండి..

జగన్ గారూ.. మీరు ప్రతీ రాష్ట్రంలోని వీవీఐపీ, ధనవంతులు, రాజకీయ నేతలు.. ముఖ్యంగా ఎన్నారైలతో స్నేహపూర్వకంగా ఉండండి.. వారు మీకు ఎన్నో రకాలుగా సాయం చేయగలరు. మీకంటే పెద్దవారైన కొందరిని గురువుగా స్వీకరించండి. సీనియర్ రాజకీయ నాయకులను నిర్లక్ష్యం చేయవద్దంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కీలక సూచనలు చేశారు.

English summary
Cine Actress Sri Reddy key suggestions to ys jagan mohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X