వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి చేదు అనుభవం, ప్రవాసులు అలిగారంట: హోదాపై శ్రీరెడ్డి, ఏపీ యువతపై ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకున్న సినీ నటి శ్రీరెడ్డి.. ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టర్, కాంగ్రెస్ నేత చిరంజీవిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తెచ్చి సంచలనంగా మారిన శ్రీరెడ్డి.. ఇప్పుడు ఏపీ సమస్యలపై ప్రశ్నలు సంధించారు.

టాలీవుడ్ పెద్దలు ఏపీ హోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదని శ్రీరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో స్పందించారు. అంతేగాక, యువత కూడా హోదా కోసం రంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు.

ప్రవాసులు అలిగారంట

‘అమెరికాలో మా అసోసియేషన్ నిర్వహించిన ప్రోగ్రాం. అదేనండీ బిల్డింగ్ కోసం డబ్బులు అడగడం కోసం చేసిన ప్రోగ్రాంకి జనాలు రాకుండా నిరసన వ్యక్తం చేశారు. హీరోలెవరూ ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదని అలిగారంట' అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీల ఫొటోలను ఆమె పోస్టు చేశారు.

చిరంజీవికి చేదు అనుభవం

కాగా, మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు డల్లాస్ వెళ్లిన మెగాస్టార్ చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక హోదా కోసం ఎందుకు ఉద్యమించడం లేదంటూ ప్రవాస భారతీయులు ఆయన్ని నిలదీశారు. చిరు ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమానికి వారంతా నల్ల దుస్తులతో వచ్చి నినాదాలు చేశారు. ఊహించని పరిణామం ఎదురుకావడంతో చిరంజీవి ఖంగుతిన్నారు. అంతేగాక, ఏప్రిల్ 28, 29తేదీల్లో నిర్వహించిన కార్యక్రమాల సందర్భంగా కొందరు ఎన్నారైలు ప్లకార్డులతో ఆడిటోరియం బయట నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఓ మీడియాలో వచ్చిన ఈ వార్తను శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు.

పాత వీడియోనే

పాత వీడియోనే

ఇది ఇలా ఉండగా, ఎన్నారై అభిమానుల అప్యాయతకు చిరు కంటతడి పెట్టుకున్నట్లు కొన్ని వీడియోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. క్లీన్ షేవ్‌తో ఉన్న చిరు మాట్లాడిన ప్రసంగంకు సంబంధించిన వీడియోలు కొన్ని ఛానెళ్లలోనూ ప్రసారమయ్యాయి. అయితే, ఆ వీడియోలు పాతవని ప్రవాసాంధ్రులు స్పష్టం చేశారు.

హోదా రాకపోవడానికి యువతే కారణం

‘తమ బాధ్యతగా భావించని యువత కారణంగానే ప్రత్యేక హోదా రావట్లేదు. ఎండకి కందకుండా, టీవీ, సెల్ ఫోన్ వదలకుండా, కాలేజీకి బంక్ కొట్టి పోరాటాలు చేయకపోతే ఎలా వస్తుంది? అమ్మాయిలు 100శాతం బయటకొస్తారని నమ్ముతున్నా.. ప్రతీది ప్రభుత్వం బాధ్యత కాదు.. ప్లాన్స్ చేయండి ఆంధ్రా కోసమే ఏం చేయగలమో..' అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

పవన్‌! ఇవేనా మీ ఆదర్శాలు?: తీవ్ర విమర్శలు చేసిన శ్రీరెడ్డి పవన్‌! ఇవేనా మీ ఆదర్శాలు?: తీవ్ర విమర్శలు చేసిన శ్రీరెడ్డి

పోరాటం చేద్దామంటూ పిలుపు

‘నా ప్రియాతి ప్రియమైన యువజనులారా, నాన్న కొనిచ్చిన సెల్ ఫోన్ లో పిచ్చి వీడియోలు చూడటం ఆపు, ఆ బైక్ మీద పనికి రాని సరదా షికార్లు ఆపు, ఆలోచించు ఏం చేయగలవో ఆంధ్రా ప్రత్యేక హోదా కోసం, నాయకులున్నారుగా వాళ్లు తెస్తారులే మన కోసం అనుకోవద్దు, ఏదో వాళ్లే చేయాలని కోరుకోరుకోవద్దు.. తెలంగాణ ఉద్యమం తరహాలో, ఇండియా ఇండిపెండెన్స్ కోసం మహానుభావులు కష్టపడిన తరహాలో నిరసన ఉధృతం చేయండి.. నేను సాధించేవరకు వదలను, పనికి రాని వాటి పై ప్రేమ, అభిమానాలు వదిలిపెట్టి ఆంధ్రా కోసం పోరాటం చేద్దాం' అని శ్రీరెడ్డి పిలుపునిచ్చారు.

English summary
Cine Actress Sri Reddy responded on Andhra Pradesh special status issue and questions Tollywood to respond.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X