వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ఆర్ సిపిలోకి శ్రీధర్,ఉభయగోదావరి జిల్లాల్లో పట్టుకోసం జగన్ వ్యూహం

మాజీ మంత్రి కోటగిరి విధ్యాధర్ రావు తనయుడు శ్రీధర్ వైసిపిలో చేరనున్నారు. ఈ నెల 28వ, తేదిన ఆయన వైసిపిలో చేరనున్నారు. ఆదివారం నాడుఆయన జగన్ తో సమావేశమయ్యారు శ్రీధర్.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోటగిరి శ్రీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నాడు. ఈ మేరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. ఈ నెల 28వ, తేదిన శ్రీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి కోటగిరి విధ్యాధర్ రావు తనయుడే శ్రీధర్, టిడిపిలో సుదీర్ఘ కాలం విధ్యాధర్ రావు పనిచేశాడు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ఆయన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించాడు.

సినీ నటుడు చిరంజీవి పార్టీని స్థాపించే సమయంలో ఆయన టిడిపిని వీడి పిఆర్ పి లో చేరారు. పిఆర్ పి కాంగ్రెస్ పార్టీలో విలీనమైన సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయన మూడేళ్ళ క్రితం మరణించాడు.

పశ్చిమగోదావరి జిల్లాలొ కోటగిరి విధ్యాధర్ రావుకు మంచి పట్టుండేది. అయితే ఆయన మరణంతో ఆయన కొడుకు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు.అయితే తండ్రి మద్దతుదారులు ఆయన వెంట నడుస్తారా లేదా అనేది చూడాలి

కోటగిరి శ్రీధర్ వైఎస్ ఆర్ సిపి చేరికకు రంగం సిద్దం

కోటగిరి శ్రీధర్ వైఎస్ ఆర్ సిపి చేరికకు రంగం సిద్దం

మాజీ మంత్రి కోటగిరి విధ్యాధర్ రావు తనయుడు శ్రీధర్ వైఎస్ఆర్ సిపిలో చేరికకు రంగం సిద్దమైంది. ఆదివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో శ్రీధర్ సమావేశమయ్యారు. శ్రీధర్ ఈ నెల 28వ, తేదిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు..జిల్లాలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన వైసిపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
వైసిపి నాయకులతో జగన్ భేటీ

వైసిపి నాయకులతో జగన్ భేటీ

పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి తనయుడు శ్రీధర్ వైఎస్ఆర్ సి పిలో చేరేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో పశ్చిమగోదావరి జిల్లా నాయకులతో జగన్ సమావేశమయ్యారు. జగన్ ఆదివారం నాడు తన నివాసంలో పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఈ జిల్లాకు చెందిన నాయకులతో కలిసి జగన్ సమావేశమయ్యారు. జిల్లాలో రాజకీయ వ్యూహంపై చర్చించారు.

 గోదావరి జిల్లాలపై కేంద్రీకరించిన జగన్

గోదావరి జిల్లాలపై కేంద్రీకరించిన జగన్

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలు కీలకంగా మారాయి. ఈ రెండు జిల్లాల్లో ప్రత్యర్థులకు ఒక్క సీటు దక్కింది. అన్ని సీట్లలో టిడిపి అభ్యర్థులే విజయం సాధించారు. ఈ రెండు జిల్లాల్లో ఓ సామాజికవర్గం ఓట్లు టిడిపికి కలిసివచ్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితులను దృస్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికలకు ఇప్పటి నుండే జగన్ సమాయత్తమౌతున్నారు. ఈ రెండు జిల్లాలపై జగన్ కేంద్రీకరించారు. తమ పార్టీలో చేరే అభ్యర్థులను ప్రోత్సహిస్తున్నారు.

 టార్గెట్ 2019 ఎన్నికలు

టార్గెట్ 2019 ఎన్నికలు

2019 లో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జగన్ వ్యూహలను రచిస్తున్నాడు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి టిడిపిలో చేరిన మాజీ ఎంఏల్ఏ కొట్టు సత్యానారాయణకు టిడిపి టిక్కెట్టు దక్కలేదు.అయితే ఆయన ఇటీవలే టిడిపిని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనది కూడ పశ్చిమగోదావరి జిల్లా. ఈ నెలఖరుకు కోటగిరి శ్రీధర్ కూడ వైసిపిలో చేరనున్నారు. ఇంకా వివిద పార్టీల్లో అసంతృప్త నాయకులను తమ పార్టీలో చేరేలా వ్యూహరచన చేస్తున్నారు.2019 ఎన్నికలను దృస్టిలో ఉంచుకొనే జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

English summary
sridar will be join in ysrcp, former minister vidyadhar rao son sridhar. sridhar will be join in ysrcp on janurary 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X