వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలోకి కాంగ్ ఎమ్మెల్యే? అంత ఈజీకాదని శైలజానాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసన సభ్యుడు శ్రీధర్ కృష్ణా రెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో ఇరు ప్రాంతాల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం బిఏసి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

సభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ లాబీల్లో శ్రీధర్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ... ఫిబ్రవరి మొదటి వారంలో తాను తెలుగుదేశం పార్టీలో చేరుతానని వ్యాఖ్యానించారు. మొదటి నుండి టిడిపిలో ఉన్న తాను కొన్ని కారణాల వల్ల పిఆర్పీలో చేరానని, ఇప్పుడు సొంత గూటికి వెళ్తానన్నారు. మంత్రి శైలజానాథ్, టిడిపి నేత పయ్యావుల కేశవ్‌ల మధ్య కూడా చర్చ జరిగింది. పలువురు నేతలు పార్టీలు మారుతారనే ప్రచారం జరుగుతోంది.

దీనిపై శైలజానాథ్ మాట్లాడుతూ... రాయలసీమ ప్రాంతంలో పార్టీలు మారడం అంత వీజీ కాదన్నారు. అదే సమయంలో సభలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు సహకరించాలని పయ్యావులను కోరారు. దానికి పయ్యావుల స్పందిస్తూ... సభలో చర్చకు సహకరించేందుకు తాము సిద్ధమేనని అయితే, చర్చకు ముందు సమాచారం తమ ముందు పెట్టాలని కోరారు.

పది గంటలకు బిఏసి సమావేశమైంది. ఈ సమావేశానికి టిడిపి నుండి మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఎర్రబెల్లి దయాకర రావు, పయ్యావుల కేశవ్‌లు హాజరయ్యారు. మరోవైపు మండలిలో కూడా జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది.

English summary
It is said that SPS Nellore district MLA Sridhar Krishna Reddy may join in Telugudesam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X