శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వరదలు: వంశధారలో చిక్కుకున్న 53మంది కూలీలు

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: ఎగువన కురిసిన భారీ వర్షాలు కారణంగా శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గొట్టా బ్యారేజ్‌ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. సమాచారం లేకపోవడంతో ఈ వరద నీటి ప్రవాహానికి సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం రేవు ఇసుక ర్యాంప్‌ వద్ద ఇరువై లారీలు, 2 జేసీబీలు చిక్కుకుపోయాయి.

లారీలో ఇసుక నింపటానికి వెళ్లిన లారీలు, జేసీబీల డ్రైవర్లతోపాటు 53 మంది కూలీలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు ప్రారంభించారు.

Srikakulam Flood: 53 Labourers Trapped

24 మందిని కూలీలను అధికారులు కాపాడారు. అయితే క్రమేణా వరద ఉధృతి పెరగడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారిని కాపాడేందుకు అధికారులు విశాఖపట్నం ప్రత్యేక నేవీ సిబ్బంది సహాయం కోరారు. బోట్లను సిద్ధం చేశామని, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్‌ సిబ్బంది సహాయక చర్యలను చేపడుతున్నట్లు డీఎస్పీ భీమారావు తెలిపారు.

English summary
Srikakulam was flooded after torrential rains lashed the district. According to latest reports, some 53 labourers (sand workers) are feared trapped in flood water near Puroshothapuram in Sarubujjili Mandal. Vamsadhara river is said to be in spate following heavy rainfall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X