వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెపిది బాబు అజెండా: శ్రీకాంత్, జగనే గుర్తు చేశారు: గాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్‌పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ తెలుగుదేశం పార్టీ అజెండాను అమలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు శ్రీకాంత్ రెడ్డి సోమవారం మండిపడ్డారు. జెపి తన స్థాయిని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. సాయంత్రం సచివాలయ ఉద్యోగుల సమావేశానికి తాము హాజరవుతామన్నారు.

జగన్ పార్టీ, టిడిపి సహకారం

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పరోక్షంగా, ప్రత్యక్షంగా రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నాయని మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. ఆయన సిఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సభలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు సహకరించాలన్నారు. కొంతమంది విభజన అంశాన్ని ఎన్నికలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. చర్చ జరిగితే వారి జాతకాలు బయటపడతాయని వద్దంటున్నారన్నారు. బిల్లుపై సవరణలు ప్రతిపాదిస్తామని, లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు చెబుతామన్నారు. చర్చకు సహకరించాలన్నారు.

Srikanth Reddy

నెంబర్ వన్ స్థానం కోసం: గండ్ర

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సీమాంధ్రలో నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి విమర్శించారు. బిఏసికి రాకుండా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారన్నారు. సభలో బిల్లుపై చర్చ జరగకపోవడం దురదృష్టకరమని గండ్ర అన్నారు. బిల్లు వచ్చాక సమైక్య తీర్మానం పెట్టాలని జగన్ పార్టీ అనడం అర్థరహితమన్నారు. చర్చ జరగకపోతే లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలు సభాపతికి ఇస్తామన్నారు. చర్చ జరగే విషయంపై ప్రభుత్వం, కాంగ్రెసు ఏకాభిప్రాయంతో ఉన్నాయన్నారు.

వైయస్ చిచ్చు: గాలి

తెలంగాణ చిచ్చు పెట్టింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అయితే, ఆర్టికల్ 3ను కేంద్రానికి గుర్తు చేసి జగన్ పార్టీ అని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. జగన్ సమైక్యవాది అయితే ఎపిఎన్జీవో ఎన్నికల్లో చీలిక తెచ్చేందుకు ఎందుకు ప్రయత్నించారో చెప్పాలన్నారు. తక్షణం రాష్ట్రం విడిపోవాలని కోరుకునే వ్యక్తి జగన్ మాత్రమే అన్నారు. అసెంబ్లీ తీర్మానం తర్వాతే ఇప్పటి వరకు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఇదే విషయాన్ని బిఏసిలో చెప్పామన్నారు. కిరణ్ లోపల ఓ మాట, బయట ఓ మాట చెబుతున్నారని ఆరోపించారు.

కాగా, అంతకుముందు బిఏసిలో ఏకాభిప్రాయం కుదరక పోవడంతో వైయస్సార్ కాంగ్రెసు, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు బయటకు వచ్చారు.

English summary
YSR Congress Party MLA Srikanth Reddy on Monday fired at Loksatta Party chief Jayapakash Narayana for critisice YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X