వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి మైండ్ గేమ్: శ్రీకాంత్ రెడ్డి, రోజాను కంట్రోల్ చేయాలని జగన్‍‌కు!

తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి బుధవారం కొట్టి పారేశారు. తాను వైసిపిలోనే ఉంటానని తేల్చి చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి బుధవారం కొట్టి పారేశారు. తాను వైసిపిలోనే ఉంటానని తేల్చి చెప్పారు.

భూమా ఎఫెక్ట్: బెట్టింగుతో అతను కోటీశ్వరుడయ్యాడు!!భూమా ఎఫెక్ట్: బెట్టింగుతో అతను కోటీశ్వరుడయ్యాడు!!

అంతా అబద్దం

అంతా అబద్దం

తాను పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోందని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను జగన్ వెంటే ఉంటానన్నారు. కావాలని తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని ధ్వజమెత్తారు. వైసిపి మనోధైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

రోజా వ్యాఖ్యలు కూడా దెబ్బతీశాయా?

రోజా వ్యాఖ్యలు కూడా దెబ్బతీశాయా?

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఓటమిలో వైసిపి నేతలు చేసిన వ్యాఖ్యల ప్రభావం కూడా ఉందనే వాదనలు ఉన్నాయి. సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన కాల్చివేత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేశాయని అంటున్నారు. అలాగే, మంత్రి అఖిలప్రియపై రోజా చేసిన వ్యాఖ్యలు కూడా దెబ్బతీశాయని అంటున్నారు.

రోజాను కంట్రోల్ చేయాలని..

రోజాను కంట్రోల్ చేయాలని..

అఖిలప్రియ డ్రెస్సింగ్ పైన రోజా చేసిన వ్యాఖ్యలు సరికాదని వైసిపి నేతలే గుసగుసలాడుకున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని జగన్‌కు కూడా చెప్పారని అంటున్నారు. రోజాను కంట్రోల్ చేయాలని, వ్యక్తిగత దూషణలతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.

వైసిపికి ఘోర ఓటమి

వైసిపికి ఘోర ఓటమి

కాగా, నంద్యాలలో లక్షా 73 వేల మంది ఓటు వేశారు. అందులో 89 వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు చాలామంది వైసిపికి వ్యతిరేకంగా ఓటు వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి చేతిలో వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి 27వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

English summary
YSR Congress Party leader Srikanth Reddy on Wednesday said that he will with YSRCP chief ys Jaganmohan Reddy will his last breath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X