వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసుల‌ను జ‌గ‌న్ ధైర్యంగా ఎదుర్కొన్నారు: కేబినెట్ భేటీ అందు కోస‌మే : శ‌్రీకాంత్ రెడ్డి ఫైర్..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేబినెట్ నిర్వ‌హ‌ణ కేవ‌లం పెండింగ్ బిల్లులు..భూసేక‌ర‌ణ కోస‌మేన‌ని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. సీఎంగా ఉండి ఆర్దిక వ్య‌వస్థ‌ను నాశ‌నం చేసార‌ని..ఆయ‌న‌కు చ‌ట్టం పైనా..రాజ్యంగం పైనా న‌మ్మ‌కం లేని వ్య‌క్తి అంటూ ఫైర్ అయ్యారు.

కేబినెట్ భేటీ అందుకోస‌మే..
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆర్టీసీని మూసివేయాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్నార‌ని వైసీపీ నేత శ్రీకాంత రెడ్డి ఆరోపించారు. ధ‌ర్మ‌పోరాట దీక్ష పేరుతో ఆర్టీసీని ఇష్టానుసారంగా వాడుకున్నార‌ని దుయ్య‌బట్టారు. మ‌రో ప‌ది రోజుల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని..ఈ స‌మ‌యంలో కేబినెట్ మీటింగ్ పెట్టి పెండింగ్ బిల్లులు,,భూసేక‌ర‌ణ కు ఆమోదం తెలిపే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు.

దివంగత నేత వైఎస్సార్‌ ఎన్నికల తరువాత ఏరోజు కూడా మీటింగ్‌ పెట్టలేదని గుర్తుచేశారు. పెండింగ్‌ బిల్లుల కోసం సీఎస్‌ సమీక్ష చేపడితే.. చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటని నిలదీశారు. కాంట్రాక్ట్‌ బిల్లులు చెల్లింపు కోసం ఏర్పాటు చేసిన సీఎమ్‌ఎఫ్‌ఎస్‌ను అవినీతిమయంగా మార్చారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు.

Srikanth reddy serious comments against Chandra Babu : CM have no confidence on law

చంద్ర‌బాబుకు రాజ్యంగం పై న‌మ్మకం లేదు..
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు రాజ్యాంగం..చ‌ట్టంపై న‌మ్మ‌కం లేద‌ని అన్నారు. డేటాను..ఈవీఎంల‌ను దొంగిలించిన వ్య‌క్త‌నుల‌ను ప్ర‌భుత్వ పెద్ద‌లు దాచార‌ని ఆరోపించారు. ఒక సామాజిక వ‌ర్గానికి చెందిన వారిని చంద్రబాబు కాపాడుతున్నార‌ని..అదే రవికుమార్‌ యాదవ్‌, పుల్లారెడ్డి అయితే మాత్రం అమ్మో అమ్మో అని టీవీల్లో కథనాలు ప్రచురించేవని చురకలంటించారు. జ‌గ‌న్ పైన కేసులు పెడితే వెంట‌నే ధైర్యంగా ఎదుర్కొన్న వ్య‌క్తం జ‌గ‌న్ అని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేసారు. టీడీపీ మాత్రం ఏపీలో వ్య‌వ‌స్థ‌ల‌ను ఎందుకిలా దిగ‌జార్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

English summary
YCP leader Srikanth Reddy serious comments on Chief Minister Chandra Babu He says Jagan faced cases with out stays. Babu conducting cabinet only for pending bills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X