విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై దాడి కేసులో నోరు విప్పిన కోడి కత్తి శ్రీను : అది ప్రమాదమే.. నన్ను కాపాడింది జగనే!

|
Google Oneindia TeluguNews

Recommended Video

నోరు విప్పిన కోడి కత్తి శ్రీను... నన్ను కాపాడింది జగనే..!! || Oneindia Telugu

కోడి కత్తి కేసులో ఏడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు పై విడుదలయ్యాడు శ్రీనివాస్. తాను ఎయిర్‌పోర్టులో కుక్‌గా పనిచేస్తున్నట్లు చెప్పిన శ్రీనివాస్ జగన్ బహిరంగ సభలు ఫాలో అయినట్లు చెప్పాడు. ప్రతి కుటుంబంలో జగన్‌ను ఒక అన్నలా భావిస్తున్నారని చెప్పాడు. జగన్ అభిమానిని కాదని నిరూపిస్తే శిరచ్ఛేరణ చేసుకుంటానని చెప్పాడు శ్రీనివాస్. తాను నార్కో టెస్టులకు కూడా సిద్దమని చెప్పుకొచ్చాడు.

ఆరోజు తాను చేసింది హత్యాప్రయత్నం కాదని జగన్ వల్లే ఈ రోజు తాను ప్రాణాలతో బతికి ఉన్నట్లు చెప్పాడు శ్రీనివాస్. తన దగ్గర ఉన్న కత్తులు పండ్లను కోసే కత్తులని చెప్పాడు. కత్తి కంగారులో జగన్‌కు తగిలిందని ఉద్దేశపూర్వకంగా ఆయనపై దాడి చేయలేదని కావాలంటే నార్కో అనాలిసిస్ టెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. తాను ఇప్పటికీ ఎప్పటికీ జగన్ అభిమానినే అని చెప్పాడు. జగన్‌ను చూడాలని ప్రజాసమస్యలతో కూడిన ఒక లేఖ ఇద్దామని మాత్రమే తాను వెళ్లినట్లు చెప్పాడు. ఆ సమయంలోనే కత్తి పొరపాటున గుచ్చుకోవడం... అనంతరం అక్కడున్న వారు తనను పట్టుకుని పోవడం జరిగిందన్నారు.

Srinivas,accused in Jagans attack case released on bail


తాను ఒక చెఫ్‌గా పనిచేస్తున్నాడని చెప్పిన శ్రీనివాస్.. కత్తి పొరపాటున గుచ్చుకుందని అయితే సింపథీ కోసం జరిగిన దాడిగా ప్రచారం జరిగిందని చెప్పాడు. ఆ సమయంలో కత్తితో పాటు మరో ఫోర్క్ కూడా ఉన్నిందని వివరించిన శ్రీనివాస్... కత్తి గుచ్చుకోగానే అక్కడి వారు తనను కొట్టే ప్రయత్నం చేశారని అయితే జగన్ వారిని వారించారని చెప్పాడు.

విశాఖపట్నం విమానాశ్రయంలో లాంజ్‌లో కూర్చుని ఉండగా శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానని చెప్పి దగ్గరకు వచ్చిన శ్రీనివాస్ తనతో పాటు తెచ్చుకున్న కోడికత్తితో జగన్ పై దాడి చేశారు.వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెయిటర్ శ్రీనివాస్‌ను పోలీసులకు అప్పగించారు. జగన్ పై దాడి ఘటన కేసుపై కోర్టును ఆశ్రయించింది వైసీపీ. దీంతో ఎన్‌ఐఏతో విచారణ చేయించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎన్ఐఏ శ్రీనివాస్‌ను విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై వాదనలు గురువారం ముగిశాయి. వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో శ్రీనివాస్ శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు.

English summary
Man accused in Jagan's attack case in Vozag airport was released from Rajahmundry central jail today on bail. He was given bail on helath reasons. NIA is investigating the case. After his release, Srinivas said that the attack on Jagan was not an intentional one. He also said that he was a huge fan of Jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X