వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా నాన్నకు వివేకా హత్యతో సంబంధం లేదు .. పోలీసులు వేధించారని శ్రీనివాసులు రెడ్డి కుమారుడి ఆవేదన

|
Google Oneindia TeluguNews

వైఎస్ వివేకా హత్య కేసులో ఊహించని మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వై ఎస్ కుటుంబం అంటే ఎంతో అభిమానం అంటూ ఆయన తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా పోలీసులు వేధింపులకు గురి చేశారని లేఖ రాసి మరీ సూసైడ్ చేసుకున్నారు .వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితుడైన కసునూరి పరమేశ్వర్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి బావమరిది కావటంతో ఈ కేసులో ఇది ఒక ట్విస్ట్ అని చెప్పొచ్చు .

షాకింగ్ ...వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యషాకింగ్ ...వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య

కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది . చికిత్స పొందుతూ శ్రీనివాసులు రెడ్డి ప్రాణాలు విడిచాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణకు పిలిచారని.. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యపై ఆయన కుమారుడు స్పందించాడు. రెండ్రోజుల క్రితం శ్రీనివాసులు రెడ్డిని పోలీసులు విచారణకు పిలిచారని , వివేకానందరెడ్డి హత్య కేసుతో సంబంధం లేకపోయినా విచారణ ఎదుర్కోవడంతో అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన చెందారు . వైఎస్‌ కుటుంబం అంటే మా నాన్నకు చాలా అభిమానం అని శ్రీనివాసులు రెడ్డి కుమారుడు పేర్కొన్నాడు.

Srinivas Reddys sons plea ... My father died of police harassment

తనకు హత్యతో సంబంధం లేదని మూడు లెటర్లు రాసిన శ్రీనివాసులు రెడ్డిని సిట్ సీఐ శ్రీరామ్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఆతమహత్యకు పాల్పడిన శ్రీనివాసులు రెడ్డి కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ తో కేసు కొత్త మలుపు తిరగనుందాఅన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
Srinivas Reddy, who is a suspect in the viveka murder case, committed suicide on Monday night. He is suicidal that the police are harassing him and his family. SIT was trying very seriously to solve the Viveka murder case but unfortunately the suspect attempted suicide and he died in a hospital .police had called Srinivas Reddy to inquire in viveka murder case. srinivasulu Reddy's son says that his faher is very affectionate to the YS family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X