రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్ప‌త్రిలో కోడిక‌త్తి శ్రీనివాస్ : జ‌గ‌న్ పై హ‌త్యా య‌త్నం కేసులో నిందితుడు..!

|
Google Oneindia TeluguNews

వైసిపి అధినేత జ‌గ‌న‌జ్ పైన జ‌రిగిన హ‌త్యా య‌త్నం కేసులో నిందితుడు అయిన జ‌నుప‌ల్లి శ్రీనివాస రావు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అత‌న్ని రాజ‌మండ్రి ప్ర‌భుత్వాస్ప‌త్రిలో చికిత్స కోసం చేర్చారు. జ‌గ‌న‌జ్ పైన ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం విశాఖ ఏయిర్ పోర్టులో కోడిక‌త్తితో హ‌త్యా య‌త్నం చేయ‌టంతో కేసు న‌మోదైంది...

రాజ‌మండ్రి ఆస్ప‌త్రిలో
గ‌త ఏడాది అక్టోబ‌ర్‌25న విశాఖ ఎయిర్ పోర్ట్‌లో వైయ‌స్ జ‌గ‌న్‌పైన కోడిక‌త్తితో దాడికి దిగిన శ్రీనివాస్ రావు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. అత‌న్ని చికిత్స కోసం రాజ‌మండ్రిలోని ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. విశాఖ ఏయిర్ పోర్ఠ్‌లోని ఫ్యూజ‌న్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో ప‌ని చేసే శ్రీనివాస రావు జ‌గ‌న్ పైన హ‌త్యా య‌త్నానికి ప్ర‌య‌త్నించారు. దీని పైనా అధికార టిడిపి..ప్ర‌తిప‌క్ష వైసిపి మ‌ధ్య తీవ్ర స్థాయిలో రాజ‌కీయ విమ‌ర్శలు చెల‌రేగాయి. దీని పైన వైసిసి కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఉత్త‌ర్వుల‌కు అనుగుణంగా ఎన్ఐఏ విచార‌ణ చేప‌ట్టింది. దీని పైనా టిడిపి విమ‌ర్శ‌లు చేసింఇ. ఏపిలో జ‌రిగిన కోడిక‌త్తి దాడి పైన ఉగ్ర‌వాదుల‌ను విచారించే ఎన్ఐఏ తో విచార‌ణ చేయిస్తుంద‌ని..ప్ర‌ధాని మోదీ ఉద్దేశ పూర్వ‌కంగా ఎన్ఐఏకు అప్ప‌గించారని ఆరోపించారు. అయితే, శ్రీనివాస రావు తాను జ‌గ‌న్ అభిమాని అని .. సంచ‌ల‌నం కోస‌మే దాడికి దిగినట్లు విచార‌ణ‌లో తేల్చార‌ని ఏపి పోలీసులు వెల్ల‌డించారు.

Srinivas who facing enquiry iin Jagan attack case joined in Hospital

ఎన్నిక‌ల్లోనూ ప్ర‌చారాస్త్రంగా..
ఇక‌, ఈ నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టిడిపి అధినేత జ‌గ‌న్ పైన దాడి కేసును కోడిక‌త్తి కేసు..కోడిక‌త్తి పార్టీ అంటూ ప్ర‌చారం లో విమ‌ర్శించారు. వైసిపి నేత‌లు మాత్రం విశాఖ ఏయిర్ పోర్టు టిడిపికి చెందిన నేత‌ద‌ని..జ‌గ‌న్ పై దాడి ఉద్దేశ పూర్వ‌కంగానే జ‌రిగింద‌ని ఆరోపిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ జ‌గ‌న్ త‌ల్లి..సోద‌రి ఈ అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఇప్ప‌టికీ రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాస రావు అస్వ‌స్థ‌త‌కు గురి కావటంతో పోలీసులు ఆయ‌న్ను రాజ‌మండ్రి ప్ర‌భుత్వాసుప‌త్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

English summary
Srinivas joined in Rajahmundry hospital due to illness. He accused in Attempr on YCp Chief Jagan in Visakha Air port in october last year. NIA and SIT investigated him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X