శ్రీనివాసన్‌తో జగన్ మంతనాలు, బ్యాక్‌గేట్ నుండి వెళ్లారు
హైదరాబాద్: బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ఇండియా సిమెంట్స్ ఛార్జీషీటు అంశంలో నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరైన అనంతరం జగన్‌తో శ్రీనివాసన్ అరగంట పాటు భేటీ అయ్యారు.

అంతకుముందు కోర్టులో హాజరైన శ్రీనివాసన్ మీడియా కంట పడకుండా వెనుక ద్వారం నుండి బయటకు వెళ్లిపోయారు. ఆయనను జగన్ ఆహ్వానించారు. శ్రీనివాసన్, జగన్‌ల భేటీ చర్చనీయాంశమైంది.
కాగా, ఆస్తుల కేసులో శ్రీనివాసన్ శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. జగన్ కేసులోని ఇండియా సిమెంట్స్ ఛార్జీషీటుపై శ్రీనివాసన్‌తో పాటు వైయస్ జగన్, విజయ సాయి రెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను కోర్టు డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

కోర్టుకు హాజరైన సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆయన చెప్పారు. తమ నిజాయితీని న్యాయస్థానంలో నిరూపించుకుంటామని చెప్పారు. సిబిఐ విచారణ జరుపుతోందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని శ్రీనివాసన్ తెలిపారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications