హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీనివాసన్‌తో జగన్ మంతనాలు, బ్యాక్‌గేట్ నుండి వెళ్లారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ఇండియా సిమెంట్స్ ఛార్జీషీటు అంశంలో నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరైన అనంతరం జగన్‌తో శ్రీనివాసన్ అరగంట పాటు భేటీ అయ్యారు.

అంతకుముందు కోర్టులో హాజరైన శ్రీనివాసన్ మీడియా కంట పడకుండా వెనుక ద్వారం నుండి బయటకు వెళ్లిపోయారు. ఆయనను జగన్ ఆహ్వానించారు. శ్రీనివాసన్, జగన్‌ల భేటీ చర్చనీయాంశమైంది.

కాగా, ఆస్తుల కేసులో శ్రీనివాసన్ శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. జగన్ కేసులోని ఇండియా సిమెంట్స్ ఛార్జీషీటుపై శ్రీనివాసన్‌తో పాటు వైయస్ జగన్, విజయ సాయి రెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను కోర్టు డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

Srinivasan with YS Jagan

కోర్టుకు హాజరైన సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆయన చెప్పారు. తమ నిజాయితీని న్యాయస్థానంలో నిరూపించుకుంటామని చెప్పారు. సిబిఐ విచారణ జరుపుతోందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని శ్రీనివాసన్ తెలిపారు.

English summary
BCCI chief N Srinivasan, an accused in graft case involving YS Jaganmohan Reddy, has appeared before CBI court in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X