గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుంగభద్ర ఎఫెక్ట్: కృష్ణమ్మకు వరద పోటు: శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత

|
Google Oneindia TeluguNews

కర్నూలు: మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావం వల్ల మరసారి కృష్ణమ్మ జలకళను సంతరించుకుంది. వరద నీటితో పోటెత్తుతోంది. కృష్ణాకు దాని ఉప నది తుంగభద్ర తోడైంది. కర్ణాటకలో తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఈ జంట నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా- తెలంగాణలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల, ఏపీలోని శ్రీశైలం రిజర్వాయర్లు వరద నీటితో పోటెత్తుతున్నాయి. అంచనాలకు మించి ఇన్ ఫ్లో నమోదవుతుండటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ కు చెందిన ఒక్కో గేట్ చొప్పున ఎత్తారు. దిగువకు నీటిని వదిలేస్తున్నారు.

టీవీ9పై కేసు నమోదు: ఈ సారి విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఎంట్రీ

ఉత్తర కర్ణాటక కకావికలం..

ఉత్తర కర్ణాటక కకావికలం..

కర్నాటక ఉత్తర ప్రాంతంలోని కృష్ణా, తుంగ, భద్ర నదీ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధార్వాడ, బెళగావి, కలబురగి, గదగ్, విజయపుర, బాగల్ కోటె, చిక్ మగళూరు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరో 48 గంటల్లో ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీనితో ఆయా నదుల వరద పోటుకు గురయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కృష్ణానది తీర ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉంది. ఎగువ నుంచి ఏ మాత్రం వరద వచ్చినా తెలంగాణలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తేయడం ఖాయమని ముందుగానే అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఇన్ ఫ్లో పెరగడంతో శ్రీశైలం, సాగర్ గేట్లను ఎత్తేశారు.

 దిగువకు 50 వేల క్యూసెక్కులు

దిగువకు 50 వేల క్యూసెక్కులు

శ్రీశైలం, నాగార్జున సాగర్ లల్లో ఒక్కో గేటును అడుగు మేర ఎత్తారు. 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం తెల్లవారు జాము నుంచి ఇన్ ఫ్లో మరింత పెరిగింది. సుమారు మూడు లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. మంగళవారం సాయంత్రంతో పోల్చుకుంటే సుమారు 75 వేల క్యూసెక్కులు అధికం. ఈ ఇన్ ఫ్లో ఇదే పరిస్థితితో కొనసాగినా, లేదా మరింత పెరుగుదల చోటు చేసుకున్నా.. మరో రెండు గేట్లను ఎత్తి వేస్తామని జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఇన్ ఫ్లోకు అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేస్తామని అన్నారు.

వరద జలాలు సీమకు మళ్లింపు..

వరద జలాలు సీమకు మళ్లింపు..

పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా శ్రీశైలం వరద జలాలను రాయలసీమకు మళ్లిస్తున్నారు. కొత్తగా వస్తోన్న వరద ప్రవాహాన్ని కూడా కలుపుకొని మొత్తంగా లక్ష క్యూసెక్కులను రాయలసీమ జిల్లాలకు పంపిస్తున్నారు. కడప జిల్లాలోని గండికోట, మైలవరం రిజర్వాయర్లకు ఈ నీరు చేరుతోంది. ఇదివరకు కురిసిన భారీ వర్షాల వల్ల ఈ రెండు మధ్య తరహా ప్రాజెక్టులు కూడా గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. వరద నీటిని వృధా చేయకూడదనే ఉద్దేశంతో.. లక్ష క్యూసెక్కులను మళ్లిస్తున్నారు. ఇన్ ఫ్లో పెరిగే కొద్దీ రాయలసీమ జిల్లాలకు మళ్లించి నీటి పరిమాణంలో మార్పులు చోటు చేసుకోవచ్చు.

English summary
Srisail Reservoir in Kurnool district and Nagarjuna Sagar in Guntur district crest gates has lifted once again due to huge in flows in the both reservoirs. One Crest gate of Srisailam and two crest gates of Nagarjuna Sagar were lifted on released the flood water to down stream.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X