వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్ కనుమరుగే: ‘శ్రీశైలం ప్రాజెక్టు’పై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచివుందా? అంటే ఔననే అంటున్నారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్. మంగళవారం ఆయన శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విషయంపై మీడియాతో మాట్లాడారు.

పెను విషాదం తప్పదు..

పెను విషాదం తప్పదు..

శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని. వెంటనే మరమ్మతులు చేయకపోతే పెను విషాదం తప్పదని రాజేంద్ర సింగ్ హెచ్చరించారు. ప్రభుత్వాలు నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయే తప్ప వాటి నిర్వహణ బాధ్యతలు సరిగా చూసుకోవడం లేదని అన్నారు.

ఏపీ కనుమరుగే..

ఏపీ కనుమరుగే..

ఏదైనా విపత్తు సంభవిస్తే ఆంధ్రప్రదేశ్ కనిపించకుండా పోతుందని రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్యాం సమీపంలో నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఎంత త్వరగా చర్యలు చేపడితే శ్రీశైలం ప్రాజెక్టును అంత పరిరక్షించుకోవచ్చని రాజేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

పెను ప్రమాదాలు తప్పాలంటే..

పెను ప్రమాదాలు తప్పాలంటే..

గంగాజల్ సాక్షరత్ యాత్రలో భాగంగా రాజేంద్ర సింగ్ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించి చర్యలు తీసుకుంటూనే పెను ప్రమాదాలు తప్పుతాయన్నారు. డ్యాం సందర్శన సందర్భంగా డ్యాం ఎస్ఈ చంద్రశేఖర్ రావును రాజేంద్ర సింగ్ కలివారు. డ్యాం సంరక్షణ చర్యలకు సుమారు రూ. 60 కోట్ల వరకు అవసరం అవుతాయన్నారు.

1963 మొదలై 1984లో పూర్తయింది

1963 మొదలై 1984లో పూర్తయింది

ప్రాజెక్టు శంకుస్థాపన 1963 జూలైలో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా జరిగింది. 1964లో రూ.39.97 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా 1991 నాటికి రూ.567.27 కోట్లయింది. డ్యాము నిర్మాణం క్రెస్టుగేట్లతో సహా 1984 డిసెంబరు నాటికి పూర్తయింది. 1985 వర్షాకాలంలో జలాశయం పూర్తి మట్టానికి నీటితో నిండింది. 2009 అక్టోబరు 2 న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి వచ్చింది. భారీ వరదనీటితో ప్రాజెక్టు అత్యధిక స్థాయి నీటిమట్టం కంటే 10 అడుగుల పై నుంచి నీరు ప్రవహించింది. శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్లో కృష్ణా నదిపై నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు. కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు, తరువాతి కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది. తరువాతి కాలంలో ప్రాజెక్టు పేరును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు.

English summary
Srisailam in danger, it's in need of urgent maintenance: Rajendra singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X