వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ వార్తలన్నీ అవాస్తవం: ఎస్.ఎస్ రాజమౌళి ఆగ్రహం

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తనపై వస్తోన్న వార్తలను తీవ్రంగా ఖండించారు.ఏపీ ప్రభుత్వానికి డిజైనర్, కన్సల్టెంట్‌గా నియమించిందనే వార్తలను రాజమౌళి ఖండించారుఏపీ ప్రభుత్వానికి చిరు సహయం చేస్తున్నానని రాజమౌళి

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కన్సల్టెంట్‌గా, డిజైనర్‌గా తనను నియమించిందంటూ వస్తోన్న వార్తలపై సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడితో దర్శకుడు రాజమౌళి బుదవారం నాడు భేటీ అయ్యారు. ఈ భేటీలో అమరావతిలో చేపట్టబోయే నిర్మాణాలపై రాజమౌళితో చంద్ర‌బాబు మాట్లాడారు. రాజమౌళి నుంచి సూచనలు తీసుకోవాలని సీఆర్డీఏ అధికారులకు చంద్రబాబు అంతకు ముందే సూచించారు.

రాజధాని డిజైన్లకోసం లండన్‌కు రాజమౌళి, తెలుగుదనం ఉట్టిపడేలా నమూనాలురాజధాని డిజైన్లకోసం లండన్‌కు రాజమౌళి, తెలుగుదనం ఉట్టిపడేలా నమూనాలు

SS Rajamouli condemned rumours on appointed as a designer

బుదవారం నాడు రాజ‌మౌళి రాజ‌ధాని ప్రాంతంలో పర్యటించారు. ఆ ప్రాంతాలను తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. రాజధాని డిజైన్ల కోసం స్థానికంగా ఉన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

తన‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ సర్కారు.. కన్సల్టెంట్, సూప‌ర్‌వైజ‌ర్‌, డిజైన‌ర్‌గా నియ‌మించిందంటూ వ‌స్తోన్న ప‌లు వార్త‌ల‌తో రాజ‌మౌళి మండిప‌డ్డారు. అందులో నిజం లేద‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపారు.రాజ‌ధాని ప్రాంతంలో నిర్మాణాల‌కు ఇప్ప‌టికే నిపుణులు ఇచ్చిన డిజైన్లు ఫ‌స్ట్ క్లాస్‌గా ఉన్నాయ‌ని రాజమౌళి అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

సీఎం చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న టీమ్ కూడా ఈ విష‌యంలో సంతృప్తిక‌రంగానే ఉన్నార‌ని, అసెంబ్లీ డిజైన్ మ‌రింత బాగుండాల‌ని వారు కోరుకుంటున్నార‌ని తెలిపారు. రాజ‌ధాని విష‌యంలో తాను అందిస్తోన్న చిరుసాయం అమ‌రావ‌తి నిర్మాణ ప్రాజెక్టుకు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

English summary
Tollywood cine director condemned rumours on appointed as a designer . i was not appointed as a consultant designer, supervisor etc, for Amaravathi are not true said Rajamouli on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X