అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజమౌళి లండన్ టూర్ ఖరారు, విమర్శలపై బాబు ఘాటుగా: ఉద్యోగులకు భారీ ఆఫర్

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, దర్శకులు రాజమౌళి లండన్ పర్యటన ఖరారైనట్లుగా తెలుస్తోంది. అక్టోబర్‌ 24, 25 తేదీల్లో నార్మన్ ఫోస్టర్‌ ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, దర్శకులు రాజమౌళి లండన్ పర్యటన ఖరారైనట్లుగా తెలుస్తోంది. అక్టోబర్‌ 24, 25 తేదీల్లో నార్మన్ ఫోస్టర్‌ ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు.

చదవండి: లగడపాటి నుంచి రాజమౌళి దాకా.. వైయస్ జగన్‍‌ను ఇరుకునపడేశారా?

బాబు, రాజమౌళి లండన్ పర్యటన ఖరారు

బాబు, రాజమౌళి లండన్ పర్యటన ఖరారు

అమరావతి నిర్మాణాలపై నార్మన్ సంస్థ ప్రతినిధులు 25న తుది డిజైన్లు ఇవ్వనున్నారు. అంతకుముందు అక్టోబరు 11, 12, 13 తేదీల్లో లండన్‌ నార్మన్ ఫోస్టర్‌ కార్యాలయంలో అమరావతి పరిపాలన నగరం డిజైన్లపై వర్క్‌షాప్‌‌లో రాజమౌళి పాల్గొంటారు. రాజధాని నిర్మాణాలపై ఈ నెల 20వ తేదిన చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ అయిన విషయం తెలిసిందే.

Recommended Video

Chandrababu taking Rajamouli's help, Know Why ? రాజమౌళిని లండన్ పంపండి: చంద్రబాబు | Oneindia Telugu
వైసిపి విమర్శలపై..

వైసిపి విమర్శలపై..

అమరావతి ప్రాజెక్టు విషయంలో రాజమౌళికి ప్రాధాన్యత ఇవ్వడంపై వైసిపి విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై చంద్రబాబు స్పందించారు. రాజమౌళి గొప్ప దర్శకులు అని, మనమంతా బాహుబలిని చూశామని, ఆయన మంచి సెట్టింగ్స్ వేశారని, కాబట్టి ఆయనను కన్సల్టంట్‌గా తీసుకున్నామని చెప్పారు. అతను సూచనలు చేస్తారని తెలిపారు. అంతిమంగా ఆర్కిటెక్ట్‌లదే నిర్ణయమన్నారు.

అంతర్జాతీయ పోటీలకు అమరావతి ఆతిథ్యం

అంతర్జాతీయ పోటీలకు అమరావతి ఆతిథ్యం

కాగా, వచ్చే ఏడాది అంతర్జాతీయ పోటీలకు అమరావతి ఆతిధ్యం ఇవ్వనుందని చంద్రబాబు తెలిపారు. విజయవాడ కృష్ణా తీరంలో ఫార్ములా వన్ తరహాలో పవర్ బోటింగ్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. తొలిసారిగా నదిలో నిర్వహిస్తున్న పీ వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు.

పది రోజుల పాటు ఈ పోటీలు

పది రోజుల పాటు ఈ పోటీలు

10 రోజుల పాటు జరిగే పోటీల కోసం వివిధ దేశాల నుంచి క్రీడాకారులు రానున్నారు. ఈ భారీ ఈవెంట్‌ కోసం నిర్ధిష్ట ప్రణాళికతో రావాలని నిర్వాహకులకు చంద్రబాబు సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనం

ఏపీ ఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు నేతృత్వంలో సీఎం చంద్రబాబును ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. పదో పీఆర్సీ బకాయిలను చెల్లించాలని ఈ సందర్బంగా సీఎంను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. 11వ పీఆర్సీ కోసం ముందుగానే కమిషన్‌ వేయాలన్నారు. ఉద్యోగ సంఘాల వినతులపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఏపీ ఆర్థికంగా బలపడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ వేతనాలు ఇస్తామన్నారు.

అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్

అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్

ఇదిలా ఉండగా, అమరావతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా అమరావతిలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has responded to critics on the controversy surrounding his government employing Bahubali director SS Rajamouli in the ambitious Amaravati Project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X