హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'తమ్ముడు'గా వచ్చి చిరుకే...: పవన్ ప్రస్థానం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవన్ కళ్యాణ్... నిన్నటి వరకు సినీ సంచలనం! ఇప్పుడు రాజకీయ సంచలనం. జనసేన పార్టీతో పవన్ రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో తాను పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రాజకీయాల్లో అడుగు పెట్టడం సాహసమే! చిరంజీవి సోదరుడిగా... అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో చిత్ర రంగ ప్రవేశం చేసిన పవన్ ఇప్పుడు చిరును సవాల్ చేస్తూ జనసేనతో ముందుకు వస్తున్నారు.

నిన్న నాగబాబు చెప్పినట్లుగా పవన్, నాగబాబు, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్... ఇలా మెగా కుటుంబ సభ్యులకు రాజబాట వేసింది చిరంజీవే. పవన్ ఈ స్థాయికి రావడానికి కారణం చిరంజీవే. దానిని పవన్ కూడా అంగీకరిస్తారు. అయితే, పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయడం ఇష్టం లేని, ప్రజలకు ఏదో చేయాలనే తపన ఉన్న పవన్ రాజకీయ పార్టీ పెట్టడం తప్పు కాదని పవన్ వర్గం అభిమానుల వాదన.

చిరంజీవి సోదరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్... ఇప్పుడు చిరునే మించిపోయే ఇమేజ్ సాధించారనే వాదన ఉంది. చిరు సోదరుడిగా ఈ స్థాయికి వచ్చిన పవన్ ఇప్పుడు... తన బాటలో పయనిస్తున్నారు. ఇప్పుడు ఆయన చిరు సోదరుడిగా కాకుండా పవన్ కళ్యాణ్‌గా ప్రజల ముందుకు వస్తున్నారు. రాజకీయాల్లో తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. చిరు సోదరుడిగా టాలీవుడ్లో అడుగు పెట్టిన పవన్... సొంతగా రాజకీయ పార్టీని స్థాపించి ఏమాత్రం నిలదొక్కుకుంటారనేది భవిష్యత్తు తేల్చనుంది.

పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని దాచుకోడనే వాదన ఉంది. ఆయన ఏదో ఒక రూపంలో తన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతాడంటారు. అలాగే అందరితోను ఎక్కువగా కలవడంటారు. కుటుంబ సభ్యులతోను అంతగా కలవరని చిరంజీవే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సమాజం కోసం తపించే వ్యక్తిగా పేరుంది. పిఆర్పీ ఉంటే ఏదో చేసేవాడని, ఆ పార్టీని చిరు విలీనం చేయడంతో ఇప్పుడు ఏదో చేయాలనే తపననే పవన్‌ను రాజకీయాల వైపు లాక్కొస్తోందంటున్నారు. పార్టీని స్థాపించాలనుకున్న పవన్ ఇతర పార్టీల నుండి ఎదురయ్యే అన్ని సవాళ్లకు సిద్ధమయ్యారట.

చిరు రాజబాటతో అడుగు

చిరు రాజబాటతో అడుగు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో కథానాయకుడిగా తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు. పవన్ కళ్యాణ్ నుండి మొదలు రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ.. ఇలా అందరు మెగా కుటుంబ సభ్యులు చిరంజీవి ఆశీస్సులతోనే చిత్ర రంగంలో వెలుగొందుతున్నారు. నాడు పవన్ కూడా అంతే. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ వన్ పొజిషన్లో ఉన్నారు. అలాంటి సమయంలో పవన్ తెర పైకి వచ్చారు. ఆయన మొదటి చిత్రం ఆశించిన విజయం సాధించలేదనే చెప్పవచ్చు.

వరుస హిట్స్

వరుస హిట్స్

పవన్ రెండో సినిమా గోకులంలో సీత 1997లో వచ్చింది. 1998లో వచ్చిన సుస్వాగతం చిత్రం పవన్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ వెంటనే వరుసగా వచ్చిన తొలిప్రేమ (1998), తమ్ముడు (1999), బద్రి (2000), ఖుషి (2001) చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ చిత్రాల ద్వారా పవన్ యూత్‌కు దగ్గరయ్యారు. ఇన్నేళ్ల తర్వాత కూడా, ఇంతమంది యువ హీరోలు వస్తున్నా కూడా ఇప్పటికీ యూత్‌లో ఎక్కువగా పవన్‌కే ఆదరణ ఉంది.

ఆదరించకున్నా

ఆదరించకున్నా

జానీ (2003), గుడుంబా శంకర్ (2004), బాలు (2005), బంగారం (2006), అన్నవరం (2006), జల్సా (2006), జల్సా (2008), పులి (2010), తీన్‌మార్ (2011), పంజా (20011) చిత్రాలు అంతగా ఆడలేదు. కొన్ని ఫెయిల్ కాగా, మరికొన్ని పరవాలేదనిపించుకున్నాయి.

కలెక్షన్లు అదుర్స్

కలెక్షన్లు అదుర్స్

వరుసగా హిట్ చిత్రాలు రాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం ఎక్కడా ఆదరణ తగ్గలేదు. యూత్‌లోను అదే ఆదరణ. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లాక ఇక భవిష్యత్తు టాలీవుడ్ టాప్ హీరో పవన్ కళ్యాణే అని అందరు భావించారు.

రికార్డులు తిరగమోత

రికార్డులు తిరగమోత

2011 వరకు హిట్ సినిమాలు లేకపోయినా కలెక్షన్లు మాత్రం పవర్ చూపించారు. అయితే, 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీంతో పవన్ జోరు అందుకుంది. ఇక పవన్‌కు తిరుగులేదంటూ అందరూ భావించారు.

 మళ్లీ ఫాంలోకి

మళ్లీ ఫాంలోకి

2012లోనే వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు అంతగా ప్రభావం చూపించకున్నప్పటికీ, మరుసటి ఏడాది వచ్చిన అత్తారంటికి దారేది చిత్రంతో మళ్లీ పవన్ ఫాంలోకి వచ్చారు. మెగా అభిమానులు కూడా పవన్ వెంట నడిచారు.

చిరు - పవన్

చిరు - పవన్

చిరంజీవి పరిచిన రాజబాటలో సినిమా రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ క్రమంగా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. నిన్నటి వరకు మెగా అభిమానులు అందరూ ఒక్కటే. ఇప్పుడు మాత్రం మెగా అభిమానుల్లోను చీలిక కనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరు పవన్ వెంట నడుస్తుండగా.. మరికొందరు చిరుకే జై కొడుతున్నారు.

చిరు అండతో వచ్చి.. పవర్‌గా మారి...

చిరు అండతో వచ్చి.. పవర్‌గా మారి...

మొత్తానికి చిరంజీవి పేరుతో సినిమాల్లోకి వచ్చిన పవన్... ఇప్పుడు పవర్ స్టార్‌గా మారారు. మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులలోను సొంత ఇమేజ్ సంపాదించుకొని.. ఇప్పుడు చిరుకే సవాల్‌గా నిలిచారంటున్నారు.

English summary
Andhra Pradesh will witness yet another star show on Friday evening with the stage set for the mega launch of Jana Sena party by mercurial actor Pawan Kalyan at a star hotel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X