• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజకీయాల్లో స్టాలిన్ నయా ట్రెండ్ : జగన్ ను అందులో డామినేట్ చేస్తూ : ఆ విషయంలో ఇద్దరూ ఒకటే, కానీ ..!!

By Lekhaka
|

ప్రతీకార రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తమిళనాడు. కరుణానిధి..జయలలిత మధ్య అక్కడ చోటు చేసుకున్న రాజకీయాలు ఒక చరిత్ర. కానీ, ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జయలలిత - కరుణానిధి మరణంతోనే ఆ తరహా రాజకీయాలకు ముగింపు పలికారు. ఇప్పపు తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి వస్తూనే నయా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఆయన పైన ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేయలేని పరిస్థితి కల్పించారు.

 నాటి రాజకీయాలకు భిన్నంగా..

నాటి రాజకీయాలకు భిన్నంగా..

నాటి తండ్రి స్టైల్ పాలిటిక్స్ కు భిన్నంగా...ప్రతిపక్షాలు ప్రధానంగా అన్నా డీఎంకే నేతలకు తగిన గుర్తింపు ఇస్తున్నారు. ఏకంగా అన్నా డీఎంకే నేతల ఇంటికి వెళ్లి వారికి నోటి మాట రాకుండా చేసారు. ఇక, కరోనా నియంత్రణ కమిటీలో ప్రతిపక్షాలకు అవకాశం కల్పించి..వారికి విమర్శించే అవకాశం లేకుండా చేసారు. తన తండ్రికి..తన పార్టీకి రాజకీయంగా బద్ద శత్రువు అయిన జయలలిత ప్రారంభించిన అమ్మా క్యాంటీన్లు యథాతధంగా కంటిన్యూ చేస్తున్నారు. ఇక, స్టాలిన్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిపోయందో ఆయన ఢిల్లీ పర్యటనలోనే స్పష్ట మైంది. ప్రధాని మోదీ ఏ సమయంలో కాల్ చేసినా...ఖచ్చితంగా స్పందిస్తానంటూ స్టాలిన్ కు హామీ ఇచ్చారు. ఇక, కాంగ్రెస్ అధినేత్రి సైతం స్టాలిన్ గ్రాండ్ వెల్ కం పలికారు.

 ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇలా..

ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇలా..

అయితే, స్టాలిన్ నయా ట్రెండ్ ఇప్పుడ ఏపీ రాజకీయాలతో సంబంధం కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అవకాశం వచ్చిన ప్రతీ అంశంలో జగన్ ను దోషిని చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. రాష్ట్రంలో ఏం జరిగినా దానికి జగన్ కారణమంటూ ప్రచారం చేసారు. ఇక, ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన సైతం చంద్రబాబు చేసిన తప్పులను వెతికి పట్టుకుంటూ...ఆయన క్యాంపులోని ముఖ్యనేతలను టార్గెట్ చేస్తున్నారు. వారు ఇక, చంద్రబాబు హయాంలో మొదలు పెట్టిన అన్నా క్యాంటీన్లను తొలిగించారు. త్వరలోనే వాటిని తిరిగి ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటికీ అమలు కాలేదు.

 జగన్ ను అందులో డామినేట చేసేసారు..

జగన్ ను అందులో డామినేట చేసేసారు..

జనాకర్షణలో కొద్ది నెలల క్రితం వరకు పలు సంస్థలు తరచుగా నిర్వహించే అత్యంత ప్రజాకర్షణ కలిగిన ముఖ్యమంత్రుల్లో దక్షిణాది నుండి జగన్ గత రెండేళ్లుగా తొలి అయిదు స్థానాల్లో నిలిచారు. కానీ, ఇప్పుడు స్టాలిన్ ఏపీ ముఖ్యమంత్రిని డామినేట్ చేసారు. ప్రజాకర్షణలో జగన్ స్థానాన్ని డామినేట్ చేసారు. అయితే, స్టాలిన్ పని తీరు..గతం కంటే భిన్నంగా తమిళనాట రాజకీయాలు చేస్తున్న తీరుతో చంద్రబాబు సైతం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలంటూ చెప్పుకొచ్చారు. ఇక, ప్రజలతో మమేకం అవ్వటంలో ఇప్పుడున్న దక్షిణాది ముఖ్యమంత్రుల్లో స్టాలిన్ ముందు వరుసలో ఉన్నారు.

 ప్రజలతో మమేకం అవుతూ..

ప్రజలతో మమేకం అవుతూ..

ముఖ్యమంత్రి అయిన తరువాత రోడ్డు మీద తన కాన్వాయ్ ఆపి తన వద్దకు సమస్య చెప్పుకోవటానికి వచ్చిన మహిళకు అవకాశం ఇవ్వటం వైరల్ అయింది. ఇక, ఇప్పుడు సీఎం స్థానంలో ఉంటూ చెన్నై ఈసీఆర్‌ రోడ్డులో సైక్లింగ్‌ చేశారు. ఈసీఆర్‌ రోడ్డులోని కోవలం నుంచి మహాబలిపురం దాకా ఆయన సైకిల్‌ను వేగంగా నడుపుకుంటూ వెళ్ళారు. ఆయనతోపాటు ఆ మార్గంలో రోజు సైక్లింగ్‌ చేసే యువకులు కూడా స్టాలిన్‌తో కబుర్లాడుకుంటూ ప్రయాణించారు. మహాబలిపురం చేరుకున్న తర్వాత అక్కడి టీ షాపులో ఆయన తేనీరు సేవించారు.

  వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన ఆ రోజే.. కీలక సన్నివేశాలకు వేదిక కానున్న ఇడుపులపాయ!! || Oneindia Telugu
   జగన్ సైతం అదే విధంగా..కానీ, ఇప్పుడు..

  జగన్ సైతం అదే విధంగా..కానీ, ఇప్పుడు..

  ప్రజలతో మమేకం అవ్వటంలో జగన్ సైతం ముందు నిలిచేవారు. సీఎం అయిన తరువాత కూడా పలు సందర్భాల్లో రోడ్డ పైన తన కోసం నిలబడి వారిని పలకరించి వారి సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు చేసేవారు. కానీ, ఇప్పుడు కొద్ది కాలంగా జగన్ ప్రజలతో దూరంగా ఉంటున్నారు. జిల్లాల పర్యటనలు లేవు. తన వద్దకు సాధారణ ప్రజలు వచ్చే అవకాశం ఇప్పటికీ కలగలేదు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతీ రోజు ఆయన క్యాంపు కార్యాయంలో ప్రజా దర్బార్ నిర్వహించేవారు. వైఎస్ స్వయంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించే వారు. జగన్ సైతం అదే చేస్తారని చెప్పినా..ఇప్పటికీ అది అమలు కాలేదు. దీంతో..ఇప్పుడు స్టాలిన్ తమిళనాట కొత్త తరహా ట్రెండ్ క్రియేట్ చేస్తూ స్టాలిన్ జాతీయ స్థాయిలోనూ చర్చకు కారణమవుతున్నారు.

  English summary
  Tamilanadu CM Stalin creating new trend in southern politics. He is Regularly meeting with common public to know thier problems. In popularity stalin dominated the AP CM Jagan's place.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X