వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో... తొక్కిసలాట... పలువురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

గుంటూరు: జనసేన ఆవిర్భావ దినోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. సభకు చేరుకునే అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకు రావడంతో...క్రమంలో తొక్కిసలాట జరగడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి కూడా చేశారు.

ఇదే క్రమంలో సభ కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ ఒక అభిమానిపై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్పృహ కోల్పోయిన ఆ అభిమానిని వాలంటీర్ల తక్షణ వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తరలించారు.

Stampede at Jana Sena Formation Day Maha Sabha

జన సేన ఆవిర్భావ దినోత్సవ మహాసభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు,అభిమానులు పోటెత్తడంతో సభ ప్రారంభానికి ముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అయితే సభ మరికొద్ది సేపట్లో ప్రారంభం అవుతుందనగా వేదిక ముందు ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది.

మొత్తం పదిమంది వరకు గాయపడగా వారిలో ఒక యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ దాడిలో గాయపడిన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.

English summary
Over 3 lakh people attended janasena's formation day public meeting at Nagarjuna University Grounds in Guntur District. As per Media Reports, A minor stampede took place soon before meeting start. Four People were injured during this incident. But one fan was attacked by the private security during this stampede, he was seriously injured. He was rushed to the hospital for treatment by volunteers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X