వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దం కాకుండానే...ప్ర‌క‌ట‌న‌లా: జ‌గ‌న్ నివాసం వ‌ద్ద తొక్కిస‌లాట‌: సీఎం విశ్వ‌స‌నీయ‌త దెబ్బ తీసేలా..

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లుద్దామ‌ని వ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు తొలి రోజే నిరాశ‌. త‌న తండ్రి త‌ర‌హాలోనే జ‌గ‌న్ సైతం ప్ర‌జా ద‌ర్భార్ నిర్వ‌హిస్తార‌ని..ప్ర‌జ విన‌తులు స్వీక‌రిస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసారు. కానీ, అది వాయిదా ప‌డింది. దీని గురించి మాత్రం పెద్ద‌గా ప్ర‌చారం లేదు. దీంతో..జ‌గ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటే ప‌రిష్కారం అవుతుంద‌నే ఆశ తో రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల నుండి సాధార‌ణ ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చారు ఫ‌లితంగా తొక్కిసలాట జ‌రిగింది. సీఎం లేరు స‌రే..వారి ఆర్జీలు తీసుకోవ‌టానికి అధికారులు లేరా. ముఖ్య‌మంత్రి విశ్వ‌స‌నీయ‌త‌కు మ‌చ్చ కాదా. ముఖ్య‌మంత్రి నివాసానికి వ‌చ్చిన బాధితులు సంధిస్తున్న ప్ర‌శ్న‌లు ఇవీ..మ‌రి స‌మాధానం చెప్పేదెవ‌రు..

Recommended Video

వైసీపీకి వ్యతిరేకంగా వివాదాలు చిత్రీకరిస్తున్నారు - ఉండవల్లి శ్రీదేవి
ప్ర‌జా ద‌ర్బార్ వాయిదా..

ప్ర‌జా ద‌ర్బార్ వాయిదా..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ రోజు నుండి అంటే జులై 1 నుండి త‌న క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద ప్ర‌జాద‌ర్భార్ నిర్వ‌హిస్తున్నా ర‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీని కోసం సీఎం క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద ఏర్పాట్లు పూర్తి చేసార‌ని ఊద‌ర గొట్టింది. ఇక త‌న తండ్రి త‌ర‌హాలోనే జ‌గ‌న్ సైతం ప్ర‌తీ రోజు ఉద‌యం గంట సేపు సాధార‌ణ ప్ర‌జ‌ల విన‌తులు స్వీక‌రిస్తార‌ని గొప్ప‌గా ప్ర‌చారం చేసింది. ఆ త‌రువాత‌నే స‌మీక్ష‌లు..స‌మావేశాలు ఉంటాయని చెప్పుకొచ్చింది. అయితే, ఆక‌స్మికంగా సీఎం నిర్వ‌హించే ప్ర‌జాద‌ర్భార్ వాయిదా ప‌డింది. ఏకంగా నెల రోజుల పాటు వాయిదా వేసారు. ఏర్పాట్లు పూర్తి కాలేద‌ని.. అసెంబ్లీ స‌మావేశాలు ఉండటంతో ఆగ‌స్టు 1 నుండి ప్ర‌జా ద‌ర్భార్ నిర్వ‌హిస్తామ‌ని చెబుతున్నారు. అయితే, అసెంబ్లీ స‌మావేశాలు ఒక్క రోజులో ఖ‌రారైన‌వి కావు..గ‌త ప‌ది రోజులుగా చెబుతున్న విష‌య‌మే. అదే స‌మయంలో ఏర్పాట్ల‌ను పూర్తి చేయ‌కుండా ప్ర‌క‌ట‌న‌లు ఎందుకు చేసారు....వాయిదా స‌మాచారం ప్ర‌జ‌ల‌కు పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వ‌లేక పోయార‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తుంటే సీఎం ఇంటి వద్ద స‌మాధానం మాత్రం లేదు.

జ‌గ‌న్‌కు చెప్పుకుంటే ప‌రిష్కారం ఉంటుంద‌ని..

జ‌గ‌న్‌కు చెప్పుకుంటే ప‌రిష్కారం ఉంటుంద‌ని..

ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న జ‌గ‌న్‌ను క‌లిసి నేరుగా త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటే ప‌రిష్కారం ల‌భిస్తుందనే ఆశ‌తో వ‌చ్చామ‌ని త‌ర‌లి వ‌చ్చిన ప్ర‌జ‌లు చెబుతున్నారు. తమ‌కు వాయిదా ప‌డిన సంగ‌తి తెలియ‌ద‌ని వాపోతున్నారు. వ‌ర్షం సైతం లెక్క చేయకుండా వ‌స్తే త‌మ‌కు స‌మాధానం చెప్పేవారు లేర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జ‌లు అంత భారీ గా వ‌చ్చిన స‌మ‌యానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చండీయాగంలో పాల్గొనేందుకు వెళ్లారు. ముఖ్య‌మంత్రి లేక‌పోయినా వారి నుండి అర్జీలు స్వీరించ‌టానికి అధికారులు సైతం ముందుకు రాలేదు. దీంతో..ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ఒక మాట చెప్పినా .. నిర్ణ‌యం తీసుకున్నా అది అమ‌లు అవుతుంద‌ని భావించామ‌ని..తొలి సారి ముఖ్య‌మంత్రిని క‌లిసేందుకు వ‌చ్చిన త‌మ‌కు ఇలా జ‌ర‌గటంతో ఆ న‌మ్మ‌కం కోల్పోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన బాధ‌తులు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు.

తొక్కిసలాట‌..స్పృహ త‌ప్పిన మ‌హిళ‌..

తొక్కిసలాట‌..స్పృహ త‌ప్పిన మ‌హిళ‌..

ముఖ్య‌మంత్రిని క‌లిసి ప్ర‌జాద‌ర్బార్‌లో త సమ‌స్య‌ల పైన అర్టీలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చారు. అయితే, ప్ర‌జా ద‌ర్బార్ నెల రోజులు వాయిదా ప‌దింది. ఆ స‌మ‌యంలో సీఎం నివాసం వ‌ద్ద తొక్కిస‌లాట జ‌రిగింది. . ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన మహిళ విశ్రాంతమ్మ స్పృహ తప్పిపడిపోయింది. సీఎంకు అర్జీ ఇచ్చేందుకు ఆమె తాడేపల్లికి వచ్చింది. సీఎం ఫిర్యాదులు తీసుకుంటారనే ప్రచారం జరగడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రజలు పెద్దసంఖ్యలో రావడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిని కలవాలంటూ ఒక్కసారిగా ప్రజలు లోపలికి రావడంతో తోపులాట చోటు చేసుకుంది. చివ‌ర‌కు మ‌రో నెల రోజుల వ‌ర‌కు ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌లేమ‌ని తెలుసుకొని వారంతా నిరాశతో వెనుదిరుగుతున్నారు.

English summary
stampede taken place in AP CM Jagan Camp office. Two days before govt announced CM Praja Darbhar every day for one hour. But, suddenly that program post pone for one month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X