వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిస్ట్‌లో పవన్, రాజమౌళి: జూ ఎన్టీఆర్ పక్కకు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల తరఫున ప్రధాన ప్రచారకర్తలు రంగంలోకి దిగనున్నారు. దాదాపు అన్ని పార్టీల నుండి సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. చిరంజీవి, రోజా, పవన్ కళ్యాణ్, రాజమౌళి తదితరులు ఉన్నారు.

బిజెపి తరఫున పవన్ కల్యాణ్, నాగార్జున ప్రచారంలోకి దిగనున్నారట. ఆర్భాటాలకు దూరంగా సాదాసీదాగా ప్రచారం చేసుకునే లోక్‌సత్తా తరఫున పవన్ కళ్యాణ్, డైరెక్టర్ రాజమౌళి ప్రచారం చేయనున్నారు. జెపిని గెలిపించాలంటూ మల్కాజిగిరిలో ప్రచారం నిర్వహించేందుకు పవన్ సిద్ధమయ్యారు.

రాష్ట్రంలో మోడీ పాల్గొనే సభల్లో కనిపించనున్న పవన్.. టిడిపి, బిజెపి అభ్యర్థుల తరఫున ప్రధాన ప్రచార కర్తగా వ్యవహరించనున్నారు. నాగార్జున కూడా ఇప్పుడు మోడీ కోసం ప్రచారం చేయనున్నారని సమాచారం.

 పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల తరఫున ప్రధాన ప్రచారకర్తలు రంగంలోకి దిగనున్నారు. దాదాపు అన్ని పార్టీల నుండి సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. చిరంజీవి, రోజా, పవన్ కళ్యాణ్, రాజమౌళి తదితరులు ఉన్నారు. పవన్ బిజెపి తరఫున ప్రచారం చేయనున్నారు. అయితే, పవన్ పేరు ప్రచార లిస్టులో లేనట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

నాగార్జున

నాగార్జున

ఇటీవల గుజరాత్ వెళ్లి మోడీని కలిసి వచ్చిన నాగార్జున బిజెపికి మద్దతుగా ప్రచారానికి ముందుకు వచ్చారని సమాచారం. లోక్‌సత్తా.. ఇది మీ సత్తా అంటూ గతంలో ప్రకటనల్లో కనిపించిన నాగార్జున ఇప్పుడు రాష్ట్రంలో బిజెపికి స్టార్ క్యాంపెయినర్ అని తెలుస్తోంది.

 స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ

కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం పొందిన జాతీయ పార్టీలు నలభై మంది మంది వరకూ స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం చేసుకోవచ్చు.

బిజెపి

బిజెపి

ఇలా బిజెపి ప్రకటించిన జాబితాలో ఆడ్వానీ మొదలుకుని ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి మోడీ, జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, రమణ్ సింగ్, మనోహర్ పరిక్కర్, రవిశంకర్ ప్రసాద్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, కల్యాణ్ సింగ్, అనంత్‌కుమార్, రాజీవ్ ప్రతాప్ రూడీ, పి మురళీధర్‌రావు, ప్రకాశ్ జవ్‌దేకర్, షానవాజ్ హుస్సేన్, యడ్యూరప్ప, సదానంద గౌడ, కె.హరిబాబు, సోము వీర్రాజు, కె శాంతారెడ్డి, పురందేశ్వరి, జొన్నవిత్తుల, సుధీష్ రాంభొట్ల, సినీ నటులు రాజశేఖర్, జీవిత, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, శివాజీ, శివాజీ రాజా, అక్కినేని నాగార్జున పేర్లను ప్రకటించారు.

నారా లోకష్

నారా లోకష్

తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే స్టార్ క్యాంపెయినర్. తాజాగా, తొలిసారిగా ఆయన తనయుడు నారా లోకేశ్ కూడా స్టార్ క్యాంపెయినర్‌గా రంగంలోకి దిగారు.

బాలకృష్ణ

బాలకృష్ణ

గతంలో ఆ పార్టీ తరఫున సినీ హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం చేసేవారు. ఈసారి హిందూపురం నుంచి బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలు కనిపించడం లేదు.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

పవన్ కళ్యాణ్‌తో పాటు హాస్యనటులు అలీ, వేణుమాధవ్ టిడిపి తరఫున ప్రచారం చేయనున్నారు. హరికృష్ణను కూడా తమ స్టార్ క్యాంపెయినర్‌గా పేర్కొన్న టిడిపి... ఈసారి జూనియర్ ఎన్టీఆర్‌కు అందులో చోటు కల్పించలేదు.

వేణు మాధవ్

వేణు మాధవ్

హాస్యనటులు అలీ, వేణుమాధవ్ టిడిపి తరఫున ప్రచారం చేయనున్నారు. హరికృష్ణను కూడా తమ స్టార్ క్యాంపెయినర్‌గా పేర్కొన్న టిడిపి... ఈసారి జూనియర్ ఎన్టీఆర్‌కు అందులో చోటు కల్పించలేదు.

రాజమౌళి

రాజమౌళి

లోక్ సత్తా పార్టీ తరఫున ప్రముఖ దర్శకులు రాజమౌళి ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. రాజమౌళి, పవన్ కళ్యాణ్‌లో జెపికి ప్రచారం చేస్తారు.

English summary
Star campaigners for Lok Satta and Bharatiya Janata Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X