• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెళ్లి అనేది అనాగరిక ఆచారం: స్టార్ కపుల్స్ విడాకులపై రామ్‌గోపాల్ వర్మ సెటైర్లు

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం కొనసాగుతున్నట్టే కనిపిస్తోంది. కొద్దిరోజుల కిందటే అక్కినేని నాగ చైతన్య-సమంత విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య ధనుష్ దూరం అయ్యారు. తామిద్దరం విడాకులను తీసుకున్నట్లు ధనుష్ వెల్లడించాడు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ ప్రకటనను పోస్ట్ చేశాడు. అదే సమయంలో మరో స్టార్ జంట విడాకులకు సిద్ధపడుతోందనే ప్రచారం టాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.

శ్రీజ-కల్యాణ్‌దేవ్..

శ్రీజ-కల్యాణ్‌దేవ్..

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ..తన సోషల్ మీడియా అకౌంట్లల్లో భర్త పేరును తొలగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భర్తతో తాను దూరంగా ఉంటున్నాననే సంకేతాన్ని ఆమె ఇవ్వకనే ఇచ్చినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. శ్రీజ-కల్యాణ్‌దేవ్ విడిపోబోతోన్నారనే విషయంపై అటు మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీనిపై ఇప్పటిదాకా చిరంజీవి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీన్ని ఆయన తోసిపుచ్చనూ లేదు.

ధనుష్-ఐశ్వర్య..

ధనుష్-ఐశ్వర్య..

అటు కోలీవుడ్‌లో కూడా విడాకుల పర్వం నెలకొంది. స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య విడిపోయారు. ఈ విషయాన్ని ధనుష్ అధికారికంగా వెల్లడించారు. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ఆయన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మనస్పర్థలు, భేదాభిప్రాయాల వల్ల తాము విడిపోతున్నామని చెప్పారు. అయినప్పటికీ స్నేహితుల్లా కలిసే ఉంటామని స్పష్టం చేశారు. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే శ్రీజ-కల్యాణ్‌దేవ్ విడాకుల వ్యవహారం తెరమీదికి వచ్చింది.

రామ్ గోపాల్ వర్మ సెటైర్లు..

రామ్ గోపాల్ వర్మ సెటైర్లు..

ఈ విడాకుల పరంపరం మీద స్టార్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. స్టార్ కపుల్స్ విడాకులు తీసుకోవడాన్ని ఆయన స్వాగతించారు. ఇదొక గుడ్ ట్రెండ్‌ సెట్‌ అంటూ అభివర్ణించారు. పెళ్లి అనేది ఎంత ప్రమాదకరమైనదో యువతరానికి తెలియజేస్తోందని స్పష్టం చేశారు. పెళ్లి పట్ల యువతలో మార్పు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. స్టార్ జంటలు విడిపోవడం అనేది యువతరానికి హెచ్చరికలాంటిదని అన్నారు.

అయిదు రోజుల్లోనే..

అయిదు రోజుల్లోనే..

పెళ్లి తరువాత ప్రేమ అనేది ఎక్కువ రోజులు ఉండదనేది ఈ విడాకులతో స్పష్టమౌతోందని రామ్ గోపాల్ వర్మ అన్నారు. పెళ్లి జరిగిందనే సంతోషం.. ఆ సెలబ్రేషన్ల హడావుడి ముగియకముందే- మూడు నుంచి అయిదు రోజుల్లోనే పెళ్లి తరువాత ప్రేమ ఉండదని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. పెళ్లి అనేది జైలుతో సమానమని కామెంట్ చేశారు. విడాకులు తీసుకున్న తరువాతే సంగీత్ వంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. పెళ్లి నుంచి విముక్తి పొందడాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అన్నారు.

పెళ్లి అనాగరిక ఆచారం..

పెళ్లి అనాగరిక ఆచారం..

పెళ్లి అనేది ఓ అనాగరిక ఆచారమని రామ్‌గోపాల్ వర్మ తేల్చి చెప్పారు. మన పూర్వీకులు తీసుకొచ్చిన దుస్సంప్రదాయంగా పేర్కొన్నారు. వివాహం చేసుకోవాలనే సంప్రదాయం సరికాదని కుండబద్దలు కొట్టారు. పెళ్లితో దుఖ్ఖం, అశాంతి తప్ప మరొకటి ఉండబోదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. పెళ్లి చేసుకున్న వాళ్లెవరూ సుఖంగా లేరనేది తన అభిప్రాయమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చలన చిత్ర పరిశ్రమలో కొత్తగా ట్రెండ్ అవుతోన్న స్టార్ కపుల్స్ విడాకుల ప్రక్రియ.. యువతరానికి హెచ్చరికలాంటిదని, జాగ్రత్త పడాలని సూచించారు.

English summary
Star director Ram Gopal Varma satires on star couple divorce, Here is what he tweeted. Star divorces are good trend setters to warn young people about the dangers of marriages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X